
దేవర తర్వాత దర్శకుడు కొరటాల శివ కెరీర్ ఒకరకమైన డైలమాలో పడిపోయిందన్న విషయం తెలిసిందే. గతంలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బస్టర్‌తో ఎన్టీఆర్‌కు భారీ విజయాన్ని అందించిన కొరటాల శివపై నమ్మకంతోనే తారక్ దేవర పేరుతో పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేశాడు. అయితే సినిమాపై ఉన్న అంచనాలను దేవర పార్ట్ 1 పూర్తిగా అందుకోలేకపోయింది. కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ, ఈ సినిమా వల్ల ఎన్టీఆర్ కొంత నిరాశ చెందాడనే టాక్ ఉంది.
దీంతో దేవర పార్ట్ 2 ఉంటుందా? లేదా? అన్న చర్చ నిన్న మొన్నటిదాకా ఇండస్ట్రీలో నడిచింది. ఒక దశలో పార్ట్ 2ను పూర్తిగా ఆపేయాలన్న ఆలోచన కూడా వచ్చిందని సమాచారం. కానీ కొరటాల శివ మాత్రం రెండేళ్ల పాటు దేవర 2 కథపై వర్క్ చేసి, ఫైనల్‌గా బలమైన కథతో సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో దేవర 2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయట.
ఇదిలా ఉండగా, ఈ సినిమా తర్వాత కొరటాల శివ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య బాబుతో కొరటాల శివ కాంబినేషన్ ఇంతవరకు పెద్దగా డిస్కషన్‌లో లేకపోవడంతో ఈ అప్‌డేట్ నందమూరి అభిమానులను ఖుషి చేస్తోంది. ఇది బాలకృష్ణ 113వ సినిమా కావచ్చని టాక్.
దేవర తర్వాత తన నెక్స్ట్ స్టెప్స్‌పై కొంత కన్ఫ్యూజన్‌లో ఉన్న కొరటాల శివ, కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో దేవర 2, ఆ తర్వాత బాలకృష్ణతో సినిమా, అంతేకాదు మరో యంగ్ హీరోతో కూడా ఒక ప్రాజెక్ట్ లైన్‌లో ఉందట. అయితే ఆ హీరో ఎవరు అన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.
రైటర్‌గా కెరీర్ ప్రారంభించి, దర్శకుడిగా మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు వరుస విజయాలు అందుకున్న కొరటాల శివకు, ఆచార్య మరియు దేవర పార్ట్ 1 ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. అందుకే ఈసారి తిరిగి ట్రాక్ ఎక్కాలనే లక్ష్యంతో ప్లాన్డ్‌గా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దేవర 2 కోసం కొరటాల శివ పూర్తిగా కొత్త కథతో, కొత్త ట్విస్ట్‌లతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నాడట. ఈసారి సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని టీమ్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక కొరటాల శివతో దేవర 2 మొదలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
Recent Random Post:















