ఇటీవల ధనుష్ – నయనతార మధ్య నెలకొన్న వివాదం కొన్ని రోజులపాటు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా నడిచింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ’ నెట్‌ఫ్లిక్స్ ఇండియా డాక్యుమెంటరీ విడుదల నేపథ్యంలో, ధనుష్ ను విమర్శిస్తూ నయన్ రాసిన ఓపెన్ లెటర్ పెద్ద దుమారం రేపింది. ఇది తన డాక్యుమెంటరీకి ప్రచారం చేసుకోడానికి వాడిన పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ధనుష్ తో వివాదంపై ఎట్టకేలకు తొలిసారి నయనతార నోరు విప్పింది. తాను పబ్లిసిటీ కోసం ఎదుటివారి ఇమేజ్ ను దిగజార్చాలని అనుకునే వ్యక్తిని కాదని చెప్పింది.
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ’లో ‘నానుమ్ రౌడీ ధాన్’ మూవీ క్లిప్స్ ను వాడుకోడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదని, పైగా 3 సెకండ్ల బీటీఎస్ విజువల్స్ ఉపయోగించినందుకు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించాడని నయన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ధనుష్ లాంటి పాపులర్ యాక్టర్ మీద ఓపెన్ లెటర్ రాయడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతారను ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ ధనుష్ తనతో డైరెక్ట్ గా మాట్లాడటానికి నిరాకరించినందున, ఈ విషయాన్ని పబ్లిక్‌గా తీసుకెళ్లడం తప్ప తనకు వేరే మార్గం లేదని తెలిపింది.
“నిజం నుండి మాత్రమే ధైర్యం వస్తుంది. నేను ఏదైనా కల్పించి చెప్పినప్పుడు మాత్రమే నేను భయపడాలి. నేను అలా చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మాట్లాడకపోతే, విషయాలు చాలా దూరం వెళ్లిన తర్వాత, మళ్లీ తమ కోసం నిలబడే ధైర్యం ఎవరికీ ఉంటుందని నేను అనుకోను. అసలు నేను సరైనది అని భావించే పని చేయడానికి నేను ఎందుకు భయపడాలి?. నేను ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. నేను కేవలం పబ్లిసిటీ కోసమే ఒకరి ప్రతిష్టను దిగజార్చాలనుకునే వ్యక్తిని కాదు” అని నయనతార అన్నారు.
“ధనుష్ మేనేజర్‌కి విఘ్నేష్ చాలా కాల్స్ చేసాడు, మేము చాలామంది కామన్ ఫ్రెండ్స్ తో మాట్లాడించాం. కానీ అవేవీ వర్కవుట్ అవ్వలేదు. ఆ సినిమాలో విఘ్నేష్ రాసిన నాలుగు లైన్లను మాత్రమే మేము ఉపయోగించాలనుకున్నాం. అది మాకు చాలా పర్సనల్. అందుకే డాక్యుమెంటరీలో ఆ లైన్స్ ఉండాలని కోరుకున్నాం. దాని కోసమే మేము నిజంగా చాలా ట్రై చేశాం. ఆ నాలుగు లైన్లు మా మొత్తం జీవితానికి సంబంధించినవి అని భావించాం. అతను (ధనుష్) ఫ్రెండ్ గా ఉన్నాడు కాబట్టి, దానికి ఓకే చెప్పే మొదటి వ్యక్తి అతనే అని నేను నిజంగా అనుకున్నాను. మేము శత్రువులుగా పుట్టలేదు. నిజంగా మేము ఎల్లప్పుడూ మంచి స్నేహితులుగా ఉన్నాం. కానీ గత 10 ఏళ్లలో ఎక్కడ, ఎలా మారిందో నాకు తెలియదు. నేను అందులోకి వెళ్ళాలని అనుకోవడం లేదు”
“ఎందుకంటే అతనికి అతని స్వంత కారణాలు ఉండవచ్చు, నాకు నా స్వంత కారణాలు ఉండవచ్చు. కానీ నేను అతని మేనేజర్‌తో మాట్లాడాను. నేను అంతకుముందు ఎప్పుడూ అలా చేయలేదు. ఎన్ఓసీ ఇవ్వకపోయినా పర్వాలేదు.. ధనుష్ తో ఒక్కసారి మాట్లాడాలని చెప్పా. అది అతని సినిమా.. ఏ క్లిప్‌లను ఉపయోగించాలి లేదా ఉపయోగించవద్దు అని చెప్పడానికి అతనికి అన్ని హక్కులు ఉన్నాయి. మేము సినిమాలోని ఆ 4 లైన్స్ యూస్ చెయ్యాలని అనుకున్నాం. కానీ తనకు అది ఇష్టం లేదని అర్థమైంది.
కానీ సమస్య ఏమిటో తెలుసుకోడానికి అతనితో జస్ట్ ఒకసారి ఫోన్ కాల్ మాట్లాడాలనుకున్నాను” “మాతో ఇష్యూ ఏంటి? అసలు ప్రాబ్లమ్ ఏంటి?, మాపై ఎందుకు అంత కోపంగా ఉన్నారు?, నిజంగానే మాపై కోపంగా ఉన్నారా?, లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సృష్టించేదేనా? ఇంకా ఏదైనా మిస్ అండర్ స్టాండింగ్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు కదా అని నేను అతనితో మాట్లాడాలనుకున్నాను. మనం మంచి స్నేహితులం కానవసరం లేదు, కానీ మనం దానిని క్లియర్ చేయగలం. దాని వల్ల మనం ఎక్కడైనా ఒకరినొకరు ఎదురుపడినప్పుడు, ఒకరినొకరు పలకరించుకోవచ్చు. కనీసం ‘హాయ్’ చెప్పుకోవచ్చు.
ఇదే నేను కోరుకున్నది. నిజంగా నేను దీని కోసమే ప్రయత్నించాను” “డాక్యుమెంటరీ ట్రైలర్ లో మా ఫోన్ లో అప్పుడెప్పుడో తీసిన బీటీఎస్ విజువల్స్ ఉపయోగించాం. కానీ జనాలు అది అర్ధం చేసుకోలేదు. అతని సినిమాలోని ఫుటేజ్.. అన్ని రైట్స్ అతనికే ఉంటాయి అని అన్నారు. మేము అస్సలు సినిమాలోని క్లిప్పింగ్స్ గురించి అస్సలు మాట్లాడలేదు. బీటీఎస్ ఇప్పుడు ఒప్పందంలో భాగం మాత్రమే. అతను చాలా పేరున్న వ్యక్తి. ప్రజలు ఆరాధించే నటుడు. మాకు కూడా అతని పట్ల అదే గౌరవం, ప్రేమ ఉన్నాయి. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం చాలా అన్యాయం అనిపిస్తుంది” అని నయనతార చెప్పుకొచ్చింది.
Recent Random Post: