ధోనీ 72 వేల షర్ట్‌ వైరల్‌… స్టైల్‌పై నెటిజన్స్ కామెంట్స్!

Share


టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. ఏ పని చేసినా అది ట్రెండింగ్ అవ్వాల్సిందే. ఆట నుంచి రిటైర్ అయినా, ఐపీఎల్‌లో కొనసాగుతున్నా, లేక ఫ్యాషన్‌లో ఓ లుక్ మారినా, ధోనీపై ఫోకస్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. తాజాగా ధోనీ ధరించిన ఓ ఖరీదైన షర్ట్‌ ఆయనను మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చింది.

ధోనీ ఇటీవల నేవీ బ్లూ కలర్ హాఫ్ స్లీవ్‌ షర్ట్ ధరించి కనిపించాడు. ఆ షర్ట్ ఖరీదు ఏకంగా రూ.72 వేలని తెలుస్తోంది. ప్రత్యేకత ఏంటంటే… ఆ షర్ట్‌పై పియానో డిజైన్‌తో పాటు మ్యూజిక్ సింబల్స్ ఉన్నాయట. దీని కారణంగానే ఆ షర్ట్ పై అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. దీనికి మ్యాచ్‌గా ధోనీ బ్లూ డెనిమ్ జీన్స్ ధరించగా, స్టైల్‌ ఐకాన్‌లా మళ్లీ ఓ రేంజ్‌లో దర్శనమిచ్చాడు.

ధోనీ లుక్‌ వైరల్‌ కావడంతో, అదే డిజైన్‌ షర్ట్ ఎక్కడ దొరుకుతుందో అని నెటిజన్స్ గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. కొందరు అలాంటి షర్ట్‌ను తక్కువ ధరకు ఆర్డర్ చేయగా, మరికొందరు మాత్రం ధోనీ వయసులో ఇలా యూత్‌ఫుల్ డ్రెస్‌లు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ‘ధోనీ ఏం చేసినా స్టైల్‌ మామూలు కాదు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే… ధోనీ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్‌లో ఘోర పరాజయాలను చవిచూసింది. సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీపై విమర్శలు భారీగా వచ్చాయి. వయసు మీద పడుతున్నప్పటికీ ఇంకా జట్టులో ఆటగాడిగానే కొనసాగడం ఎందుకు అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. ధోనీ ఇక జట్టుకు మెంటర్‌గా మారితే బాగుంటుందన్నదే కొందరి అభిప్రాయం. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోనీ ఆడతాడా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తికరం గా మారింది.


Recent Random Post: