నట్టి కుమార్ దిల్ రాజుపై ఘాటు విమర్శలు

Share


తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. థియేటర్ల బంద్ వెనుక అంతర్యాలపై సునిశితంగా ప్రశ్నలెత్తించిన ఆయన, తాజాగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

“ఇక్కడ ఉండట్లేను.. ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్లిపోయా” అనే దిల్ రాజు మాటలపై నట్టి కుమార్ మాట్లాడుతూ –
“ఆయన ఆ స్థాయికి వెళ్లాలని ఎప్పుడూ కోరుకుంటా. ఎందుకంటే నా తర్వాతే ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్నో హిట్స్ అందుకున్నారు, కోట్ల రూపాయలు సంపాదించారు – ఇది నిజంగానే సంతోషకరం. కానీ ‘డ్రీమ్స్’ అంటూ కొత్త వాళ్లతో సినిమాలు చేస్తానని చెప్పినా, వాస్తవానికి బయట పరిస్థితి చాలా వేరుగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

“ఇటీవల ట్రోల్స్ చూసారా? – ‘మీకు ఏ హీరో డేట్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ అన్న మాట చెబుతున్నారా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు” అంటూ వివరించారు.

హోస్ట్ అడిగిన ప్రశ్నకు – “ఈ మధ్య రూ.100 కోట్ల మార్క్ దాటిన హీరోల్లో ఎవరైనా దిల్ రాజుకు డేట్ ఇచ్చారా?” – నట్టి కుమార్ దీన్ని ప్రస్తావిస్తూ, “పేర్లు చెప్పను, కానీ వాస్తవాన్ని మాత్రం తప్పనిసరిగా చెప్పాలి” అన్నారు.

సినిమా బంద్ పై చురకల మాటలు
“జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ప్రకటించారని తెలిసినప్పటికీ… జూన్ 5న ‘థగ్ లైఫ్’, మే 30న ‘భైరవం’, జూన్ 12న ‘వీరమల్లు’ రిలీజ్‌లు ఉన్నాయని తెలిసినపుడు పెద్దలు ఏం చేస్తున్నారు? ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు.

“ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే మంత్రి దుర్గేష్ స్పందించారు. అంతవరకు ఎవ్వరూ నోరు విప్పలేదు. ఎందుకు?” అంటూ నాటి పరిస్థితులను గుర్తు చేశారు.

తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం స్పష్టం చేశారు
“నేను ఎవ్వరిపై వ్యక్తిగతంగా కాదు, పరిశ్రమ మీద ప్రేమతో మాట్లాడుతున్నా. పెద్ద నిర్మాణ సంస్థలు – మైత్రీ, సితార – పెద్ద బడ్జెట్ సినిమాలు తీసే స్థాయిలో ఉన్నాయి. గతంలో ఎం.ఎస్.రెడ్డి, సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు పెద్ద సినిమాలు తీసారు. కానీ ఇప్పుడు ఆ స్థాయికి చేరినవి మైత్రీ, సితారలు” అని అభిప్రాయపడ్డారు.


Recent Random Post: