నయనతార షాకింగ్ డిసిషన్: రెమ్యూనరేషన్ తగ్గింపు!

Share


సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ప్రస్తుతం ‘లేడీ సూపర్ స్టార్’గా అభిమానుల మన్ననలు అందుకుంటోంది. వివాహం అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతూ, అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా వెలుగొందుతోంది.

అయితే తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం నయనతార తన రెమ్యూనరేషన్‌ను గణనీయంగా తగ్గించిందని సమాచారం. మొదట్లో ఈ చిత్రానికి ఆమె పారితోషికం రూ.18 కోట్లు అనే వార్తలు వెలువడినా, చివరికి రూ.6 కోట్లకే ఆమె ఒప్పుకున్నట్లు టాక్.

ఈ నిర్ణయంపై సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇది ఆమె బ్రాండ్ విలువకు దెబ్బ అంటుండగా, మరికొందరు మాత్రం చిరంజీవి సినిమా ప్రాంతీయ ప్రాజెక్ట్ కావడంతో తక్కువ పారితోషికంతో నటించేందుకు ఆమె సిద్ధమయ్యారని చెబుతున్నారు. అలాగే టాక్సిక్ లాంటి బాలీవుడ్ ప్రాజెక్టుల కోసం మాత్రం ఆమె భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని అంటున్నారు.

‘గాడ్‌ఫాదర్’ తర్వాత మళ్లీ చిరంజీవితో స్క్రీన్‌షేర్ చేయబోతున్న నయన్, తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నా ప్రాజెక్ట్‌కు అద్భుతమైన హైప్‌ను తీసుకురావడంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషించనుంది. ఆమె కెరీర్‌లో తొలిసారిగా ఇలా పారితోషికాన్ని తగ్గించడం నిజంగా ఆశ్చర్యకరం.


Recent Random Post: