
సినిమా పరిశ్రమలో 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక నటి అంటే అది అసాధారణం. స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం తన నటన, అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ స్థాయికి చేరిన నయనతార, ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త మైలురాయిని చేరింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, నయన్ తన అభిమానులతో, పరిశ్రమతో ఎమోషనల్ నోట్ ద్వారా తన కృతజ్ఞతలు వ్యక్తం చేసింది.
నయనతారకి ‘లేడీ సూపర్ స్టార్’ అనే ట్యాగ్ కేవలం హైప్ కోసం కాదు. భాషలు, హీరోలు ఎటువంటి మార్పు తీసుకురాన్నప్పటికీ, ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్‌లో నిలిచే శక్తి తనకు ఉంది. ఈ 22 ఏళ్లలో చూపించిన కన్సిస్టెన్సీ, ప్రతిభ వల్లే ఈ ఘనత సాధించగలిగింది.
తాజాగా విడుదల చేసిన నోట్‌లో, “మొదటిసారిగా కెమెరా ముందు నిలబడినప్పుడు, సినిమాలు నా ప్రపంచం అవుతాయన్న ఆశే లేదు. పరిశ్రమలోకి వచ్చాక ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి అనుభవం నాకు ధైర్యం, నమ్మకం ఇచ్చింది. ఈ ప్రయాణంలో నా తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు,” అని పేర్కొంది.
నయనతార సినీ ప్రయాణం 2003లో మలయాళ చిత్రం ‘మనస్సിനక్కరే’తో మొదలైంది. తెలుగు ప్రేక్షకులకు ఆమె ‘చంద్రముఖి’తో పరిచయం అయింది. అప్పటి నుండి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస విజయాలు సాధిస్తూ వచ్చింది. ఇటీవల ‘జవాన్’తో బాలీవుడ్‌లో కూడా తన మార్క్ చూపించింది.
ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 8 ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల కోసం మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా 2026 సంక్రాంతికి రాబోతుంది. 22 ఏళ్లుగా ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగుతున్న నయనతార, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నా కూడా వెనక్కి తగ్గలేదు. కొత్త ప్రాజెక్టులతో ఆమె బాక్సాఫీస్‌పై ఎలా దాడి చేస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.
Recent Random Post:















