మెగాస్టార్ చిరంజీవి ని స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది పరిశ్రమకొచ్చి సక్సెస్ అయ్యారు. హీరోలుగా..నటులుగా ..నిర్మాతలుగా..దర్శకులుగా ఎదిగిన వారెంతో మందికి మెగాస్టార్ ఆదర్శం. ఇక మెగాస్టార్ కోసమే ప్రత్యేకించి పరిశ్రమికొచ్చిన వారు కొందరున్నారు. ఇండస్ర్టీలో ఎంత మంది హీరోలున్నా వాళ్ల టార్గెట్ కేవలం మెగాస్టార్ మాత్రమే.
కళ్లు మూసినా..తెరిచినా చిరంజీవి మాత్రమే కనిపిస్తారు. అంత కమిట్ మెంట్ తో వచ్చే వాళ్లు కేవలం అభిమానులు మాత్రమే. అలా వచ్చిన వారు మాత్రమే మెగాస్టార్ తో స్నేహాన్ని పంచుకునే స్థాయికి ఎదుగుతారు. అవును ఇవన్నీనిజమే అని దర్శకుడు బాబి.. చిరంజీవితో కలిసి దిగిన `నాడు-నేడు` ఫోటోని చూస్తుంటే అర్ధమవుతుంది.
కొన్నేళ్ల క్రితం బాబి యువకుడిగా ఉన్నప్పుడు అభిమానిగా మెగాస్టార్ తో షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. అప్పుడు చిరంజీవి షేక్ హ్యాండ్ ఇస్తే అతని చేతిని తన రెండు చేతులతో అదిమి పట్టుకుని ఎంతో సంబర పడ్డాడు. ఇప్పుడు అదే చిరంజీవితో ఆలింగనం అందుకునే స్థాయికి ఎదిగాడు. షేక్ హ్యాండ్ తీసుకున్న ఆఫోటో పక్కనే ఇలా బాబిని ఎంతో అప్యాయంగా అన్నయ్య ఆలింగనం చేసుకున్నారు.
అంతేనా బాబి చెంపపై అంతే ఆప్యాయతను ఓ ముద్దుతోనూ చాటారు. అభిమానిగా చిరు వద్దకు వెళ్తే షేక్ హ్యాండ్..అదే అతన్ని డైరెక్ట్ చేసే స్థాయికి చేరితో ఆలింగనం అందుకోవచ్చని బాబి నిరూపించాడు. ప్రస్తుతం ఈఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. అన్నయ్యతో అభిమాన తమ్ముడు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి తో బాబి `వాల్తేరు వీరయ్య` అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా అన్నయ్యతో సినిమా చేయడం అన్నది కొన్నేళ్ల కల. ఆ కల నేడు సాకరమైంది. సంక్రాంతి కానుకగా ఈ ద్వయం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన అభిమానమంతా ఎలా ఉంటుందన్నది అన్నయ్యని వెండితెరపై చూసినప్పుడు అర్ధమవుతుందని బాబి దీమాగా ఉన్నాడు. బాబి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎదిగిన వాడు.
రైటర్ గా ప్రస్థానం మొదలు పెట్టి…అటుపై అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యాడు. `పవర్` సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అటుపై `జై లవ కుశ`..`వెకీ మామ` లాంటి సక్సెస్ లు అందుకున్నారు. అన్నయ్య కంటే ముందే తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `సర్దార్ గబ్బర్ సింగ్` సినిమా తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇప్పుడు అన్నయ్య తో పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టనర్ తో అన్ని లెక్కలు సరిచేయబోతున్నాడు.
Recent Random Post: