
ప్రతి సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ, విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు మరో ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా హిట్ 3, మే 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నాని, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.
తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నానన్న నాని, ఈ చిత్రానికి వచ్చిన A సర్టిఫికేట్ కూడా బుకింగ్స్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని చెప్పారు. ముందస్తు బుకింగ్స్ అద్భుతంగా రావడం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.
దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో బలంగా రూపొందించారని, హిట్ ఫ్రాంచైజ్‌లో వయొలెన్స్ ప్రధానమైన అంశం కాకపోయినా, హిట్ 3లో ఆ తీవ్రత అనుకోకుండా పెరిగిందని నాని తెలిపారు. హిట్ 4లో మాత్రం అలాంటి వయొలెన్స్ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
తన కుమారుడికి ఈ సినిమాను చూపించనని, అలాగే ఇతరులు కూడా పిల్లలకు చూపించవద్దని నాని స్పష్టంగా చెప్పారు. పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా దూరంగా ఉండవచ్చు అనే విషయం తెలుసుకున్నప్పటికీ, లక్ష్య ప్రేక్షకులందరికీ ఇది తప్పకుండా నచ్చుతుందని నాని ధైర్యంగా చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ సినిమా కోసం కొత్త తరహాలో సౌండ్ డిజైన్ చేశారని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఉందని నాని పేర్కొన్నారు. హిట్ 3 ప్రతి ఒక్కరికి థియేటర్‌లో ఒక నెవర్ ఫర్గెటబుల్ అనుభూతిని అందిస్తుందని, తన పాత్ర అర్జున్ సర్కార్ ను ప్రేక్షకులు తప్పకుండా ఇష్టపడతారని నాని విశ్వాసంగా తెలిపారు.
క్లైమాక్స్ మిగిలి పోయేలా ఉండబోతుందని చెబుతూ, హిట్ 3 ఒక ఎమోషనల్, ఇంటెన్స్ రైడ్ అవుతుందని నాని పేర్కొన్నారు.
Recent Random Post:















