నాని ‘హిట్ 3’ మే 1న రిలీజ్ – భారీ అంచనాల మధ్య థ్రిల్లింగ్ ఎంట్రీ

Share


నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిట్: ది థర్డ్ కేస్ మే 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించగా, నాని స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగం. మొదటి రెండు భాగాల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ నటించగా, రెండూ విజయం సాధించాయి. రెండో భాగం హిట్ 2లోనే నాని నటించనున్నట్లు హింట్ ఇవ్వడంతో, హిట్ 3పై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ కాప్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. ముందు భాగాలతో పోలిస్తే ఇది మరింత ఇంటెన్స్, డార్క్, పవర్ఫుల్‌గా ఉండబోతోందని స్పష్టమైంది. నాని కూడా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇక ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే, ఇండస్ట్రీలో హిట్ 3 రికార్డు స్థాయిలో డీల్స్ దక్కించుకుందని టాక్. ఆంధ్రాలో రూ.15 కోట్లు, సీడెడ్ రూ.5 కోట్లు, నైజాంలో రూ.11-12 కోట్లు వరకూ బిజినెస్ చేసిందట. థియేట్రికల్‌గా వరల్డ్ వైడ్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్లను తాకిందని తెలుస్తోంది.

ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ స్టేటస్ రావాలంటే రూ.75 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ అవసరమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, ఓటీటీ హక్కుల విషయంలోనూ నెట్‌ఫ్లిక్స్ నుండి భారీ డీల్ కుదిరిందట. ఇది సినిమా మొత్తానికి మరింత బూస్ట్ అవుతుంది.


Recent Random Post: