నెల ముందుగానే ఆ పని పూర్తి చేసిన ‘డాకు మహారాజ్‌’

ఈ రోజుల్లో చాలా మంది దర్శకులు పెద్ద హీరోల సినిమాలను చివరి నిమిషం వరకు చెక్కుతూనే ఉంటారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంకా షూటింగ్‌ లేదా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌, రీ రికార్డింగ్‌ అంటూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ డాకు మహారాజ్ సినిమా విషయంలో అలా జరగడం లేదు. ఇటీవలే సినిమా షూటింగ్‌ పూర్తి చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయడం ద్వారా హైప్‌ క్రియేట్‌ చేయడం జరిగింది. ఇక సినిమాను భారీ ఎత్తున ప్రమోట్‌ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజాగా డాకు మహారాజ్ షూటింగ్‌ పూర్తి చేసిన దర్శకుడు బాబీ ఇప్పుడు బాలకృష్ణతో డబ్బింగ్‌ సైతం చెప్పించారు. దర్శకుడు బాబీ చాలా స్పీడ్‌గా ఉన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఇంకా విడుదలకు నెల రోజుల సమయం ఉంది. అయినా కూడా వర్క్ పూర్తి చేయడం నిజంగా చాలా పెద్ద విషయం అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో డాకు మహారాజ్ సినిమాకు హైప్‌ క్రియేట్‌ చేయడం కోసం ప్రతి రోజు ఏదో ఒక విషయాన్ని, వార్తని షేర్‌ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బాలయ్య డబ్బింగ్‌ పూర్తి అనే విషయాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోందని, అది కూడా అతి త్వరలో పూర్తి కాబోతుందని దర్శకుడు బాబీ సన్నిహితులు చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూఎస్‌లో ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి, అదే సమయంలో పోటీ కూడా బాగానే ఉంటుంది.

సంక్రాంతికి ఇప్పటికే డాకు మహారాజ్ సినిమాకు పోటీగా రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్ సినిమా రాబోతుంది. ఆ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు, ఇక వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైతం సంక్రాంతి పోటీలో నిలిచింది. కనుక ఈ రెండు సినిమాలతో పోటీ పడాలి అంటే కంటెంట్‌తో పాటు ప్రమోషన్‌ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అందుకే డాకు మహారాజ్ సినిమాకు భారీ ఎత్తున ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగానే వర్క్‌ పూర్తి చేశారని తెలుస్తోంది.


Recent Random Post: