పరేష్ రావల్ ఝలక్ – అక్షయ్ కుమార్‌కు షాక్!

Share


హేరా ఫేరీ ఫ్రాంచైజ్ ఎంత పాపులర్‌ అనేది అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో బాబూరావు గణపత్రావ్ పాత్రలో అదిరిపోయే నటనతో ప్రేక్షకులను అలరించిన పరేష్ రావల్, తాజాగా ఈ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హేరా ఫేరీ రెండు సూపర్‌హిట్ సినిమాల తర్వాత, మూడో భాగం కోసం అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తుండగా ఈ నిర్ణయం వచ్చింది.

ఇలాంటి సమయంలో పరేష్ రావల్ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం నిర్మాత అక్షయ్ కుమార్ టీమ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఫలితంగా, పరేష్ రావల్‌పై రూ.25 కోట్ల నష్టపరిహారం దావా వేయడం చర్చనీయాంశంగా మారింది. పరేష్ రావల్ ఎందుకు సినిమా నుండి వైదొలిగారో ఇంకా స్పష్టత రాలేదు.

ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్ తన తాజా విజయమైన హౌస్‌ఫుల్ 5 హిట్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉండగా, ఈ సమస్యపై స్పందించారు. పరేష్ రావల్ రీమ్యూనరేషన్‌ను వడ్డీతో సహా తిరిగి ఇచ్చినా, ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఇతర ఆర్టిస్టుల డేట్స్, ప్రొడక్షన్ ఖర్చులు అన్నీ దెబ్బతిన్నాయని అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో త్వరలోనే సానుకూల పరిష్కారం ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

తన రాబోయే మూవీ కన్నప్ప ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప సినిమాలో అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Recent Random Post: