పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఓ వైపు రాజకీయాల్లో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. చాలా కాలంగా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. రాజకీయ సభల్లో పాల్గొంటూనే మరోవైపు చేతిలో మూడు నాలుగు చిత్రాల షూటింగ్లలోనూ పాల్గొంటున్నారు. కానీ ఇప్పుడది కుదరేటట్టు పరిస్థితులు కనపట్లేదు. దీంతో నిర్మాతలు అభిమానులు దర్శకులు పవన్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఓ విషయం వీరికి-పవన్ మధ్య అతి పెద్ద సవాల్‌గా నిలిచింది. వివరాళ్లోకి వెళితే..
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పరిస్థితులు వాడీవేడీగా ఉన్నాయి. పొలిటికల్ హీటో ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలక్షన్స్‌లో జనసేన ఎలాగైనా గెలిపించాలని.. సీఎం పదవి చేపట్టాలని లక్ష్యంగా జనసేనాని ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలోనే కొద్ది రోజుల పాట షూటింగ్స్‌కు బ్రేక్ చెప్పి ‘వారాహి’ విజయ యాత్ర చేపట్టారు. యువతను మేల్కోలిపేలా వ్యాఖ్యలు చేస్తూ ర్యాలీని చేపట్టారు. గతంలో కన్నా వ్యూహాత్మకంగా ఆలోచనలతో కూడిన వాగ్భాణాలను సంధించారు. అయితే మొదటి దశ ఈ మధ్యే ముగిసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ‘వారాహి’ విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. రెండో దశ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో పవన్ అభిమానుల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పవన్ యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని జనసేన అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఇదే సమయంలో వారిలో ఓ చిన్నపాటి ఆందోళన కూడా నెలకొంది. ముఖ్యంగా పవన్ సినీ అభిమానులు నిర్మాతలు దర్శకుల్లో ఈ ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.
పవన్ ఎలక్షన్స్‌లో బిజీ అయిపోతే.. పెండింగ్‌లో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి? అవి ఎప్పుడు పూర్తవుతాయి ప్రమోషన్స్ ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు? వంటి ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి. పవన్ రాజకీయాంలో యాక్టివ్‌గా ఉండాలని వారు కోరుకుంటూనే అదే సమయంలో సినిమాలు కూడా చేయాలని వారు గట్టిగా ఆశిస్తున్నారు. కానీ రాజకీయాల్లోకి పవన్ మరింత ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటే సినిమాలను కాస్త గ్యాప్ ఇస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అందరూ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రాజకీయ పరిస్థితులు ద్వారా సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. హరి హర వీరమల్లు అయితే ఇప్పటికే ఎటువంటి అప్డేట్స్ లేకుండా అడ్రెసే లేదు. అసలా చిత్రం విషయంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు.
మరి ఇలాంటి సమయాల్లో.. పవన్ తన సినిమా షెడ్యూల్స్‌ను ఎలా ప్లాన్ చేస్కారు ఏ సినిమాలకు ఎలా డేట్స్ కేటాయిస్తారు? దర్శకనిర్మాతల-పవన్ మధ్య డీలింగ్ ఎలా ఉండబోతుంది? అసలు ప్రమోషన్స్‌కు వస్తారా లేదా? అనే పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇదో పెద్ద డిఫికల్ట్ టాస్క్‌గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఇకపోతే పవన్ ఈ నెల 29న ‘బ్రో’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. వారాహి విజయ యాత్ర రెండో షెడ్యూల్ విషయానికొస్తే.. జులై 7 సాయంత్రం 5గం. – ఏలూరులో బహిరంగ సభ. జులై 10 మధ్యాహ్నం 12 గం. – జనవాణి సాయంత్రం 6 గం. – ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు వీర మహిళలతో సమావేశం. జులై 11న మధ్యాహ్నం 12 గం. – దెందులూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు వీర మహిళలతో సమావేశం సాయంత్రం 5 గం. – తాడేపల్లిగూడెం చేరుకుంటారు. జులై 12న సాయంత్రం 5 గం. – తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ.
Recent Random Post: