పహల్గామ్ దాడి: ‘అబీర్ గులాల్’ సినిమాకు బ్యాన్ పిలుపులు

Share


నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాది దాడి 28 పైగా అమాయక పర్యాటకుల ప్రాణాలను తీసింది. పర్యాటక సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న వారిని మతం అడిగి ప్రాణాలు తీసిన వైనం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ దుర్ఘటనకు స్పందిస్తూ, సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన భారతదేశానికి వచ్చి, సరిహద్దుల్లో ప్రక్షాళన చర్యలను మొదలుపెట్టారు. ఆర్మీ ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లుగా సమాచారం. ఈ పరిణామం నేపథ్యంలో, కొన్ని సామాజిక వేదికలు హిందీ సినిమా “అబీర్ గులాల్”ని నిషేధించాలని పిలుపులు పెడుతున్నాయి.

ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఫవద్ ఖాన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు, వాణి కపూర్ అతని జోడిగా కనిపించనున్నారు. ఆర్తి ఎస్ బాగ్ది దర్శకత్వం వహించగా, అమిత్ త్రివిడి సంగీతం అందించారు. పాకిస్థాన్ లో ఎన్నో సినిమాలు చేసిన ఫవద్ ఖాన్, 2014 లో “ఖూబ్సూరత్” సినిమాతో ఇండియాలో కెరీర్ ప్రారంభించాడు. 2016లో “కపూర్ అండ్ సన్స్” మరియు “ఏ దిల్ హై ముష్కిల్” సినిమాలలో నటించిన తరువాత, పాకిస్థాన్ లో 9 సంవత్సరాలు గడిపాడు. ఇప్పుడు “అబీర్ గులాల్” తో భారతదేశంలో రీ-ఎంట్రీ చేస్తున్నాడు.

ఈ చిత్రం విడుదలపై పాక్ ప్రోత్సహించే చర్యలకు నిరసనగా, పలువురు నెటిజన్లు “అబీర్ గులాల్”ను బ్యాన్ చేయాలని ట్రెండింగ్ చేస్తున్నారు. “పక్క దేశం ప్రోత్సహిస్తున్న చర్యలకు నిరసనగా ఇది అవసరం” అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇండియాలో పలు ప్రతిభావంతులైన నటులతో కూడిన హీరోలుండగా, పాకిస్థాన్ నటుడిని తీసుకొచ్చి నటించించడం ఆలోచించదగిన విషయం అని కొంతమంది భావిస్తున్నారు. ఫవద్ ఖాన్ ఈ దుర్ఘటనపై స్పందించకపోతే, నిరసనలు మరింత తీవ్రం కావచ్చు.


Recent Random Post: