పీఆర్వోస్ అంతా నా డార్లింగ్స్: శర్వా

టాలీవుడ్ డైనమిక్ స్టార్ శర్వానంద్ వరుస చిత్రాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క జీవితం మూవీ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న శర్వా.. ఇప్పుడు మనమే సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా.. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య సరికొత్త కథతో తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ.. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. సినిమాలో మొత్తంగా 16 పాటలు ఉంటాయని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍ లో ఇటీవల డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పి షాకిచ్చారు. వాటిలో చాలా బిట్ సాంగ్స్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకు హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా.. మూవీకి మ్యూజిక్కే బలమని చెప్పారు. తాజాగా మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

ఈ సందర్భంగా పీఆర్వోస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శర్వా. “డార్లింగ్ పీఆర్వోస్.. పీఆర్వోస్ అంతా నా డార్లింగ్స్.. మేమంతా ఒకేసారి జర్నీ స్టార్ట్ చేశాం. వంశీ శేఖర్ నా ఫస్ట్ సినిమా కో అంటే కోటితో పీఆర్వోగా స్టార్ట్ అయ్యారు. ఈరోజు బిగ్గెస్ట్ కంపెనీలా ఎదిగారు. అందుకు చాలా గర్వంగా ఉంది. మీతో పాటు నేను కూడా జర్నీలో ఉన్నందుకు ఇంకా గర్వంగా ఉంది” అని చెప్పారు.

అయితే ఈ ఈవెంట్ ను పవన్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పిఠాపురంలో నిర్వహిస్తామని మేకర్స్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమేనని శర్వానంద్ తెలిపారు. పోలీసుల పర్మిషన్లు లేకపోవడం వల్ల అక్కడ నిర్వహించలేకపోయామని చెప్పారు. అందుకే సక్సెస్ పార్టీ అక్కడ ప్లాన్ చేయమని నిర్మాతలను కోరుతున్నట్లు చెప్పారు. పిఠాపురంలో ఫస్ట్ మూవీ ఈవెంట్ మనమే చిత్రానిది జరగాలని తన కోరిక అని వెల్లడించారు.

ఇక సినిమా విషయానికి వస్తే శర్వా, కృతి హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. చిన్న పిల్లవాడు హైలైట్ గా నిలవనున్నాడు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ లో ఆ పిల్లవాడు కనిపించాడు. ఆ బాలుడు ఎవరో కాదు.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు విక్రమ్ ఆదిత్య. వెన్నెల కిశోర్, ఆయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.


Recent Random Post: