కావ్యాథాపర్ టాలీవుడ్ కి సుపరిచితమే. ఎనిమిదేళ్ల క్రితమే `ఈ మాయ పేరేమిటో` అనే చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత `ఏక్ మినీ కథ`తో మరింత వెలుగులో కి వచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు అమ్మడు కి సరైన సక్సెస్ అందించలేదు. దీంతో అప్పటికే ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ అనతరం రవితేజ్ హీరోగా నటించిన `ఈగిల్` లో ఛాన్స్ అందుకుంది.
ఈ సినిమా హిట్ పై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడా నిరాశ తప్పలేదు. దీంతో అమ్మడి పని ఇక టాలీవుడ్ లో అయిపోయినట్లేననుకున్నారంతా. కానీ సరిగ్గా అదేసమయంలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ `డబుల్ ఇస్మార్ట్` కి హీరోయిన్ గా ఎంపిక చేసాడు. దీంతో ప్లాప్ హీరోయిన్ కి పూరి ఛాన్స్ ఇవ్వడం ఏంటి? ఎప్పుడూ కొత్త భామల వైపు చూసే పూరి ఎనిమిదేళ్ల క్రితం నాటి నటిని తీసుకోవడం ఏంటి? అన్నచర్చ సాగింది.
కానీ దీని వెనుక చాలా పెద్దకథే ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. పూరి తో కావ్యాథాపర్ పరిచయం ఇప్పటిది కాదు. `ఇస్మార్ట్ శంకర్` నుంచి కొనసాగుతుందని తేలింది. అవును తొలుత `ఇస్మార్ట్ శంకర్` ఆడిషన్ కోసం పూరి ఆఫీస్ కి వెళ్లిందిట. కానీ సెట్ కాకపోవడంతో తీసుకోలేదుట. ఆ తర్వాత మళ్లీ `డబుల్ ఇస్మార్ట్` తీస్తున్నారని తెలిసి ఆడీషన్ కి వెళ్లిందిట. ఈసారి మాత్రం పూరి, చార్మీ నో చెప్పకుండా ఎంపిక చేసారు అన్న విషయాన్ని కావ్యాథాపర్ తెలిపింది.
అలా పూరి అండ్ కోతో అప్పటి నుంచి టచ్ లో ఉండటంతోనే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాధార ణంగా పూరి సినిమా హీరోయిన్లు అంటే కొత్త వాళ్లు..ముంబై నుంచి దిగుమతి అయిన వాళ్లు కనిపిస్తారు. ఆ ల్ రెడీ సినిమాలు చేసిన హీరోయిన్ ఎంపిక అవ్వాలంటే? ఆమె పెద్ద హీరోయిన్ అయి ఉండాలి. లేకపోతే పూరి తీసుకోడు. కొత్త వాళ్లకు ఇచ్చిన ప్రాధాన్యత ఎనిమిదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన వారికి పూరి ఇవ్వరు. కానీ కావ్యా థాపర్ దాన్ని సాధ్యం చేసింది.
Recent Random Post: