పెళ్లికి దూరంగా మృణాల్‌ ఠాకూర్‌: కెరీర్‌ మీదే ఫోకస్

Share


టాలీవుడ్‌లో వరుస విజయాలతో ఫాలోయింగ్ పెంచుకుంటున్న మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సక్సెస్‌ఫుల్ హీరోయిన్ల లిస్ట్‌లో పేరు సంపాదించింది. ‘సీతారామం’తో గుర్తింపు పొందిన మృణాల్, తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం తెచ్చుకుంది. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో రెండు హిట్ అవ్వగా, ఒకటి మాత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గ ఫలితం అందుకోలేకపోయింది. ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి ఓ డెకాయిట్ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తుంది.

తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూనే బాలీవుడ్‌లో కూడా అవకాశాల జోలికి వెళ్తున్న మృణాల్ తాజాగా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

పెళ్లి, కుటుంబ జీవితం గురించి స్పందించిన మృణాల్ – ‘‘నాకు త్వరగా పెళ్లి కావాలనిపిస్తుంది, పిల్లల్ని కనాలన్న కోరిక కూడా ఉంది. కానీ ఇప్పటికీ ఆ విషయాల్లో తొందర లేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కెరీర్ మీదే ఉంది. నేను అనుకున్న టార్గెట్లు నెరవేర్చేవరకు పెళ్లి గురించి ఆలోచించను,’’ అని తెలిపింది.

ఇలాంటి అభిప్రాయాన్ని చాలామంది హీరోయిన్లు చెబుతారు. కానీ మృణాల్ మాత్రం తన నిర్ణయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించింది. పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్‌పై ప్రభావం పడతుందని భావించి, ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది.

ఆమె నిర్ణయం అభిమానులకు ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే పెళ్లి తర్వాత నటీనటుల్లో మార్పులు రావడం సహజం. పాత్రలు తగ్గిపోవడమే కాదు, అవకాశాలూ పరిమితమవుతాయి. అందుకే మృణాల్ కొంతకాలం పాటు పెళ్లి విషయంలో దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యింది.

అందువల్ల ఆమెను ఇప్పటికీ వెండితెరపై లవ్లీగా, యాక్టివ్‌గా చూస్తూనే ఉండే ఛాన్స్ అభిమానులకు ఖచ్చితంగా ఉంటుంది.


Recent Random Post: