
సినిమాలు ఓకే చేయడంలో స్పీడ్ చూపిస్తున్నా, వాటిని పూర్తి చేయడంలో మాత్రం కొంచెం టైమ్ తీసుకుంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ఇప్పుడు ఆయన గేర్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దసరా మిస్ అయితే, క్రిస్మస్ టార్గెట్ అని టాక్ వినిపిస్తోంది.
ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను కూడా శరవేగంగా లాగిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో థియేటర్లకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు మేకర్స్. అలాగే సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ సినిమాను కూడా కేవలం ఒకే ఏడాదిలో కంప్లీట్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట.
అంటే రాజా సాబ్ ఈ ఏడాది వస్తే, ఫౌజీ, స్పిరిట్ 2026లో విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు సలార్ 2, కల్కి 2, మరియు ప్రశాంత్ వర్మతో రూపొందబోయే కొత్త సినిమా కూడా ప్రభాస్ షెడ్యూల్లో ఉన్నాయి.
ఈ సినిమాలన్నీ ఆలస్యం కావడంపై కొంతమంది విమర్శలు చేసినా, ఫ్యాన్స్ మాత్రం సినిమా బడ్జెట్, భారీ స్థాయి వీఎఫ్ఎక్స్ వర్క్ వల్లే ఆలస్యం అవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.
ఏదేమైనా 2026 నాటికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక పండుగే అని చెప్పొచ్చు. రెబల్ స్టార్ నుంచి వచ్చే రెండేళ్లలో బాక్సాఫీస్‌కి ఊపిరి పీల్చే అవకాశం లేదు!
Recent Random Post:















