ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా దండయాత్ర

Share


టాలీవుడ్‌లో ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న ప్రాజెక్ట్ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్). యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ తొలిసారి కలిసి చేస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. కాంతార 2 ఫేమ్ రుక్మిణీ వాసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ మొదలైంది.

దేవర, వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ కొట్టాలన్న లక్ష్యంతో, ఇప్పటివరకు చూడని పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఆయన కనిపించబోతున్నారని టాక్. కథ డిమాండ్ మేరకు భారీగా బరువు తగ్గి, పూర్తిగా ఈ సినిమాకే అంకితమయ్యాడని తెలుస్తోంది.

ఇప్పటివరకు కర్ణాటకలోని కీలక ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇది ఒక ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. 1969 కాలంలో చైనా – భూటాన్ – ఇండియా సరిహద్దు ప్రాంతం నేపథ్యంగా సాగే ఈ కథలో, ఎన్టీఆర్‌పై తెరకెక్కే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయట. మునుపెన్నడూ చూడని స్థాయిలో ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైన్, ప్రెజెంటేషన్ ఉండబోతుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అంతేకాదు, ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ కూడా కీలక పాత్ర పోషించనుందని ఇన్‌సైడ్ టాక్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ కాజోల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కేజీఎఫ్ సిరీస్‌లో ఇందిరా గాంధీ పాత్రకు రవీనా టాండన్‌ను తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కాజోల్‌ను నమ్ముకున్నాడన్న వార్తలు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.

ఇదే సమయంలో మలయాళ స్టార్ టొవినో థామస్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కాజోల్, టొవినో థామస్ వంటి బలమైన నటులు యాడ్ కావడంతో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ మళ్లీ ఫుల్ స్పీడ్‌లో కొనసాగుతుండగా, పాన్ ఇండియా హిట్ కోసం సింహగర్జనకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ 25 వరకు వేచి చూడాల్సిందే.


Recent Random Post: