ప్రశాంత్ వర్మ ప్రాజెక్టులపై అనిశ్చితి

Share


ప్రశాంత్ వర్మ కెరీర్ మొదలైనప్పటి నుండి ప్రతీ సినిమాతో కొత్త కాన్సెప్ట్‌లను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆయన, సీక్వెల్‌గా జై హనుమాన్ను ప్రకటించారు. 2025లో రిలీజ్ అని అనౌన్స్ చేసినప్పటికీ, ఇప్పటివరకు షూటింగ్ మొదలుకాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చిత్రానికి సరైన కాస్టింగ్‌ కోసం చాలా సమయం తీసుకున్న ప్రశాంత్ వర్మ, చివరికి కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిని హీరోగా ఫైనల్ చేశారు. ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసిన తర్వాత ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా భవిష్యత్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక రిషబ్ శెట్టి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాంతారా ప్రీక్వెల్తో పాటు, ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా ఒక చిత్రం, అలాగే సితార బ్యానర్‌లో ఒక పీరియాడిక్ డ్రామా చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ల మధ్య జై హనుమాన్కు డేట్స్ ఇస్తారా లేదా అన్న సందేహం ఉంది.

ఇదివరకు మహాకాళి పేరుతో రణవీర్ సింగ్‌తో ప్లాన్ చేసిన సినిమా, నందమూరి మోక్షజ్ఞతో ప్రకటించిన ప్రాజెక్ట్‌ కూడా జరగలేదు. ఈ తరహా అనిశ్చితి కారణంగా ప్రశాంత్ వర్మ ప్రాజెక్టులపై క్లారిటీ లేకపోవడం గమనార్హం.

డైరెక్టర్‌గా టాలెంట్ ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఇలా ఆలస్యం చేస్తే కెరీర్‌కి రిస్క్ అవుతుందని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఏ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు, ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది చూడాలి.


Recent Random Post: