
ఇండియాలో అత్యంత విజయవంతమైన వెబ్‌సిరీస్‌లలో ఒకటైన ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ చివరకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సీజన్–2 నుండి నాలుగున్నరేళ్ల తర్వాత రాజ్–డీకే తెచ్చిన ఈ కొత్త సీజన్, థ్రిల్ పరంగా కొద్దిగా తగ్గినప్పటికీ మొత్తంగా ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నట్టు ప్రేక్షకుల మాట. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తూ భారీ వ్యూయర్షిప్ను దక్కించుకుంటోంది.
కొత్తగా వచ్చిన పాత్రలు, ఆకర్షణలే కాకుండా ఈ సీజన్లో కనిపించిన క్యామియోలు కూడా మంచి హైలైట్ అయ్యాయి. జైదీప్ ఆహ్లావత్, శ్రేయా ధన్వంతరి, నిమ్రత్ కౌర్‌ల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా, విజய் సేతుపతి, సందీప్ కిషన్, రాగ్ మయూర్ కెమియోలు ప్రత్యేకంగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా బండి ద్వారా గుర్తింపు పొందిన రాగ్ మయూర్ ఈసారి ఇచ్చిన కామెడీ టచ్ తెలుగు ఆడియన్స్‌కు బాగా నచ్చింది.
హిందీ వెర్షన్లోనే రాగ్ మయూర్‌తో దర్శకులు తెలుగు డైలాగులు చెప్పించడం ఓ ప్రత్యేకత. ట్రైన్లో టీటిగా శ్రీకాంత్ తివారి ఫ్యామిలీతో సంభాషించే సీన్లో చిత్తూరు కనెక్షన్‌ను ప్రస్తావించడం మరింత హిలేరియస్‌గా మార్చింది. జేకే తల్పాడే తెలుగులో ఇబ్బంది పడే సన్నివేశం కూడా బాగానే నవ్వులు పంచింది. ఈ చిత్తూరు ఎపిసోడ్ పెట్టడానికి కారణం కూడా స్పెషల్—రాజ్–డీకే ఇద్దరూ చిత్తూరుకు చెందినవారే. చిన్న పట్టణం నుంచి బాలీవుడ్ వరకు ఎదిగి, ఇండియాలో టాప్ డైరెక్టర్లలో నిలవడం నిజంగా గొప్ప విషయం.
Recent Random Post:















