బన్నీ కథతో చరణ్ సినిమా – త్రివిక్రమ్ గేమ్ ప్లాన్!

Share


త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకుంటోందన్న వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సొంత బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌నే చరణ్‌కి త్రివిక్రమ్ తో సినిమా చేయమని సలహా ఇచ్చినట్టు కూడా టాక్. పవన్ సినిమాలు ఆలస్యం కావడంతో, ఆ గ్యాప్‌ లో త్రివిక్రమ్‌కి ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచన వెనుక ఉందని తెలుస్తోంది.

అయితే, అసలు సంగతేంటంటే… త్రివిక్రమ్ ఇప్పుడు రామ్ చరణ్‌కు వినిపిస్తున్న కథ మాత్రం కొత్తది కాదు. ఇది మొదట అల్లు అర్జున్ కోసం తయారు చేసిన కథ అన్నదే తాజా టాక్. త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది. కానీ అట్లీ సినిమా అనూహ్యంగా బన్నీ ప్లాన్‌లోకి రావడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయింది. అట్లీ సినిమా పూర్తవ్వాలంటే కనీసం రెండేళ్లు పడుతుందన్న అంచనాతో త్రివిక్రమ్ మరో హీరో వైపు చూడాల్సి వచ్చింది.

దాంతో త్రివిక్రమ్ ముందుగా సిద్ధం చేసిన బన్నీ కథనే రామ్ చరణ్‌కు వినిపించారని సమాచారం. ఈ కథపై చరణ్ మంచి ఆసక్తి చూపించడంతో ప్రాజెక్ట్ స్పీడుగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా RC17 తర్వాత త్రివిక్రమ్ సినిమా కూడా మొదలవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ నిర్మాణ బాధ్యతలు తీసుకోవడంతో మెగా ఫ్యామిలీ సమీకరణాలు మరింత బలపడతాయనే భావన ఉంది.

ఇదిలా ఉంటే… బన్నీ, పవన్ ఫ్యామిలీ మధ్య ఇటీవలే చిన్నపాటి మనస్పర్ధలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పుష్ప సినిమాకి సంబంధించి బన్నీ మామ పవన్‌ను క్షమాపణలు చెప్పాలంటూ పరోక్షంగా మీడియా ద్వారా డిమాండ్ చేసిన వ్యవహారం పెద్ద చర్చకే దారితీసింది. అప్పటి నుంచి బన్నీ – మెగా ఫ్యామిలీ మధ్య తలెత్తిన దూరం ఇప్పటికీ తగ్గలేదన్నది టాలీవుడ్ గాస్.


Recent Random Post: