బిగ్ బాస్ సీజన్ 8 లో గౌతం కృష్ణ రన్నరప్ గా నిలిచాడు. నిఖిల్ వర్సెస్ గౌతం అంటూ టైటిల్ రేసులో వీరిద్దరి మధ్య భీకరమైన పోటీ ఏర్పడింది. ఐతే ఆడియన్స్ చివరకు నిఖిల్ ని విన్నర్ ని చేసి గౌతం ని రన్నర్ ని చేశారు. ఐతే సీజన్ 7 లో 12వ వారమే ఎలిమినేట్ అయిన గౌతం ఈ సీజన్ వైల్డ్ కార్డ్ గా వచ్చి అదరగొట్టాడు. సీజన్ 8 లో ఐదో వారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతం మొదటి రెండు వారాలు పెద్దగా ఆట ఆడలేదు.
ఐతే మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ టైం లో అతను డేంజర్ జోన్ లో ఉన్నాడు. కానీ మణికంఠ వెళ్లడంతో అతను సేఫ్ అయ్యాడు. అప్పటి నుంచి ఆట తీరు మార్చి మళ్లీ ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్లిన గౌతం గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్లాడు. ఫైనల్ గా టాప్ 5 తర్వాత టాప్ 2 కి వచ్చాడు. ఐతే గౌతం సీజన్ 8 లో 10 వారాల పాటు హౌస్ లో ఉన్నాడు. ఒకదశలో గౌతమే విన్నర్ అన్నట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ లు వచ్చాయి.
ఐతే గౌతం రన్నరప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అతను ఐదో వారం హౌస్ లోకి వెళ్లడమే. మరోపక్క తను టాస్కుల్లో అంతగా పర్ఫార్మ్ చేసింది ఏమి లేదు. కానీ ఎటాకింగ్ లో పాయింట్ మాట్లాడటంలో గౌతం మార్కులు కొట్టేశాడు. ఇక సీజన్ 8 లో 10 వారాల పాటు హౌస్ లో ఉన్న గౌతం భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. రోజుకి 30 వేలు చొప్పున వారానికి 2 లక్షల 10 వేలతో మొత్తం 10 వారాలకు గాను 21 లక్షల దాకా గౌతం పారితోషికం పొందాడని తెలుస్తుంది.
నిఖిల్, గౌతం ఇద్దరు టాప్ 2 లో ఉన్నప్పుడు నాగార్జున వారిద్దరికి గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశాడు. అందులో ఎంత ఉన్నా సరే ఇద్దరు ఆడియన్స్ ఓట్ ప్రకారంగానే వెళ్లాలని అనుకున్నారు. టైటిల్ కచ్చితంగా కొడతా అనే నమ్మకంతోనే గౌతం గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ రిజెక్ట్ చేశాడు. దాని వల్ల విన్నర్ కు ఫుల్ ప్రైజ్ మనీ పొందే అవకాశం వచ్చింది.
Recent Random Post: