
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ జీవితం నిజమైన స్పూర్తిదాయక కథ. ఒక్కప్పుడు ముంబై వీధుల్లో ఓ బెంచీపై నిద్రించిన ఈ శాహెన్షా, అప్పుల కారణంగా అన్నీ కోల్పోయినా మళ్లీ ఎదిగిన ఘన చరిత్ర కలవాడు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న బిగ్ బీ, ఇప్పుడో కార్పొరేట్ ఐకాన్. ఆయన కుటుంబ ఆస్తుల విలువ ఇప్పుడు రూ. 1600 కోట్లకు చేరింది.
బచ్చన్ తన సంపాదనను ఫ్లాట్లు, భవనాలు, బిజినెస్ వెంచర్లలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ముంబైలో ఐదు విలాసవంతమైన ఇండ్లను కలిగి ఉన్న ఆయన, ప్యారిస్‌లోనూ రూ. 3 కోట్ల విలువైన ఒక బంగ్లాను సొంతం చేసుకున్నారు. ‘జల్సా’ అనే రూ. 112 కోట్ల విలువైన ఇంటిలో ఆయన కుటుంబం నివాసం ఉంటుంది. ‘ప్రతీక్ష’, ‘జనక్’, ‘వత్స’ వంటి మరో మూడు ఆస్తులు ఆయన కలిగి ఉన్నారు. ఇవిలో కొన్ని నివాసం కోసం, మరికొన్ని కార్యాలయాలుగా, కొన్నిటిని లీజుకిచ్చారు.
అలహాబాద్‌లో ఆయన పూర్వీకుల ఇంటిని ఇప్పటికీ బచ్చన్ కుటుంబం కలిగి ఉంది. ఆయన కుమారుడు అభిషేక్‌తో కలిసి జల్సా వెనుక భాగంలో మరో సంయుక్త ఆస్తి ఉంది. అంతేకాదు, జయా బచ్చన్ ఆయనకు ప్యారిస్‌లో విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు.
లగ్జరీ లైఫ్ స్టైల్లో బిగ్ బీకి కొదవేం లేదు. ఆయన వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్ జిటి, పోర్స్చే కేమన్ ఎస్, మెర్సిడెస్ SL500, లెక్సస్ LX470 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇంకా ఆయన కుటుంబం తరచూ ప్రయాణించే ప్రైవేట్ జెట్ కూడా ఉంది.
ఒక్కసారి జీవితం తలకిందులైనా, శ్రమతో తిరిగి పైకి రావచ్చని, కలలు నిజమవుతాయని అమితాబ్ బచ్చన్ జీవితం చాటి చెబుతోంది.
Recent Random Post:















