బ్లూ లెహంగాలో మాయ చేసిన ఆషికా రంగనాథ్

Share


ప్రముఖ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది. నిత్యం లేటెస్ట్ ఫోటోషూట్లు, గ్లామర్ పిక్స్‌తో నెట్టింట హీట్ పెంచుతోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా మరో ఫోటోషూట్‌తో అభిమానులను ఆకట్టుకుంది.

ఇటీవల బ్లూ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఆషికా, తన కాటుక కళ్లతో కుర్రకారును మాయ చేసింది. సింపుల్ లుక్‌లోనే తన అందంతో మెస్మరైజ్ చేసిన ఈమె, మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్లామర్ ఓవర్‌డోస్ కాకుండా, క్లాసీగా కనిపిస్తూ ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన దక్కించుకుంటోంది.

ప్రస్తుతం ఆషికా రంగనాథ్, మాస్ మహారాజా రవితేజతో కలిసి నటిస్తున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇందులో రవితేజకు ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో ఆషికా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మునుపెన్నడూ లేని విధంగా చాలా గ్లామరస్‌గా కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని ఆషికా కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఆషికా ఇలా తన అందంతో నెట్టింట సందడి చేస్తోంది.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్‌తో పాటు డింపుల్ హయతి కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. కిషోర్ కె. తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఆషికా రంగనాథ్, అమిగోస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తెలుగులో నా సామిరంగా సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. 2016లో కన్నడ చిత్రం క్రేజీ బాయ్తో కెరీర్ ప్రారంభించిన ఈమె, రాంబో 2, మదగజ, రేయ్మో వంటి చిత్రాలతో కన్నడలో భారీ పాపులారిటీ దక్కించుకుంది. గ్లామర్‌తో పాటు నటనతోనూ మంచి మార్కులు కొట్టిన ఆషికా, తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ తన మార్కెట్‌ను విస్తరించింది.

ఇక ఈమె సోదరి కూడా నటి కావడం గమనార్హం. ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ షోతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది ఈ ముద్దుగుమ్మ.


Recent Random Post: