
-సినీ ఇండస్ట్రీలో ఏదీ ఖచ్చితంగా జరగదనుకోకూడదు. ఇవాళ మీకో అవకాశం వస్తే రేపటికి అది పోవచ్చు, ఒకరికి రాసిన పాత్ర ఇంకొకరికి దక్కవచ్చు. ఇటువంటి అనూహ్య పరిణామాలు సినిమా రంగంలో మామూలే.
ఇటీవల థగ్ లైఫ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఒక ఆసక్తికరమైన సంఘటనను షేర్ చేశారు. 1991లో రజనీకాంత్ – మణిరత్నం కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తోంది అని, ఆ సినిమాలో ఓ పాత్ర కోసం తనను సంప్రదించారని చెప్పారు. ఆడిషన్, లుక్ టెస్ట్ అన్నీ జాగ్రత్తగా జరిగినా, చివరికి “వయసు సరిపోదు” అనే కారణంతో ఆ అవకాశం ఆయనకు దక్కలేదు. అది వింటూనే నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చిందట.
ఆ రోజు నుండి మణిరత్నం సినిమాలో నటించాలన్న కోరిక భరణిలో మిగిలిపోయింది. ఏళ్ల తరబడి దానికోసం ఎదురు చూశారు. ఆ కోరికను మలచిన క్షణం మూడుదశాబ్దాల తర్వాత వచ్చింది — మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా తెలుగు వర్షన్ స్క్రిప్ట్ పనిలో భాగంగా భరణికి మళ్ళీ అవకాశం వచ్చింది. అప్పుడు భరణి, “మీ తదుపరి సినిమాలో కనీసం ఒక చిన్న సీన్ అయినా నాకు ఇవ్వండి” అని మణిరత్నాన్ని అడిగారట. కానీ అప్పట్లో మణిరత్నం సైలెంట్‌గా నవ్వేసినప్పటికీ, తర్వాత థగ్ లైఫ్ సినిమాలో మంచి పాత్రతో భరణిని సంప్రదించారట.
ఒక చిన్న సీన్ ఆశించి అడిగిన భరణికి, థగ్ లైఫ్ లో కీలకమైన పాత్ర దక్కడంతో ఆయన కల నెరవేరింది. తాను ఏ సినిమా మిస్సయ్యానో భరణి ఖచ్చితంగా చెప్పకపోయినా, రజనీకాంత్-మణిరత్నం కాంబోలో వచ్చిన దళపతి అని పలువురు ఊహిస్తున్నారు.
ఇక భారీ అంచనాల నడుమ థగ్ లైఫ్ రిలీజ్‌కి రెడీ అవుతుండగా, కమల్ హాసన్ ఈ సినిమాను తాను మణిరత్నంతో చేసిన నాయకన్ కంటే గొప్పదిగా అభివర్ణించడం గమనార్హం.
Recent Random Post:















