మంచు మనోజ్ హాట్ కామెంట్స్, నన్నెవరూ తొక్కలేరు!

Share


టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరత్ హీరోగా తెరకెక్కిన ‘జగన్నాథ్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మనోజ్, ఈ ఈవెంట్‌లో చేసిన ప్రసంగం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన మాటలు కేవలం సినిమా ప్రమోషన్‌కే పరిమితం కాకుండా, తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ప్రస్తావించాయి.

ఈ టీజర్ లాంచ్‌లో మనోజ్ మాట్లాడుతూ, తనపై జరుగుతున్న కుట్రలు, ట్రోలింగ్, విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చారు. “నన్ను తొక్కాలని ప్రయత్నించే వారు చాలామంది ఉన్నారు. కానీ ఎవరూ నన్ను అభిమానుల గుండెల నుంచి తొలగించలేరు” అంటూ ఘాటుగా స్పందించారు. అభిమానుల ప్రేమే తనకు అసలైన బలమని, వారి ఆశీస్సులతో ఎవరైనా ఎదిరించినా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు.

ప్రసంగంలో మనోజ్ తన ప్రస్తావనతో ఆసక్తికరమైన పాయింట్లను చర్చకు తెచ్చారు. ముఖ్యంగా సినిమా బడ్జెట్‌పై మాట్లాడుతూ, “సినిమా బడ్జెట్ ఎంతైనా పరవాలేదు. ప్రేక్షకులను కదిలించగలగాలే గానీ, వందల కోట్ల బడ్జెట్ పెద్ద విషయమే కాదు” అని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ఒక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌పై జరిగిన చర్చను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభిమానుల గురించి మాట్లాడుతూనే మనోజ్ భావోద్వేగానికి లోనయ్యారు. “మీరు నా దేవుళ్లు.. మీరే నా కుటుంబం. నేను అమ్ముడుపోయే కాయో, పండో అనుకోకండి. నా ఫ్యాన్స్ నా సొంతం. నన్ను ఎవరైనా తొక్కాలనుకున్నా, లేపాలనుకున్నా, అది మీ వల్లే జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఆ శక్తి చూపించలేరు” అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇక, “న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తాను. అది ఎవరికైనా సంబంధించినా సరే.. నేను వెనకడుగు వేయను. నా ప్రాణం ఉన్నంతవరకు విద్యార్థుల కోసం, సమాజం కోసం నిలబడతాను” అంటూ తన సంకల్పాన్ని వెల్లడించారు. ఈ మాటలు ఆయన మానసిక స్థైర్యాన్ని ప్రతిబింబించాయి.

ఈ ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆయన నిజాయితీని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇది పరోక్షంగా కుటుంబ రాజకీయాలపై పంచ్ అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే, మనోజ్ ఈ వ్యాఖ్యలతో మరోసారి తన అభిమానులకు దగ్గరయ్యారు. ‘జగన్నాథ్’ సినిమా ప్రమోషన్ కోసం మొదలైన ఈ వేదిక, కుటుంబ వివాదాలు, వ్యక్తిగత అభిప్రాయాలన్నీ కలగలిసి ఓ పెద్ద చర్చకు దారి తీసింది. మంచు ఫ్యామిలీలో ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.


Recent Random Post: