
టాలీవుడ్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న విభేదాలు ఇటీవల పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మీడియా ముందే మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వరుస ఆరోపణలు చేసుకోవడంతో ఈ కుటుంబ కలహం మరింత తీవ్రరూపం దాల్చింది. అయితే గత కొంతకాలంగా పరిస్థితి కొంత సద్దుమణిగినట్లు అనిపిస్తోంది.
ఈ సమయంలో మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నలు అప్పట్లో ఎక్కువయ్యాయి. ఇప్పుడు తొలిసారిగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మంచు కుటుంబ విభాదాలపై స్పందిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
“దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే… మా కుటుంబం మళ్లీ పాత రోజుల్లా ఒకటిగా మారాలని మాత్రమే కోరుకుంటాను. మా అందరం కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఉండాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటాను” అని లక్ష్మి చెప్పుకొచ్చారు.
ప్రతి కుటుంబంలోనూ తగాదాలు సహజమనిపించే లక్ష్మి, “ఎన్ని వివాదాలు వచ్చినా చివరికి నిలిచేది కుటుంబమే. ఇండియన్ ఫ్యామిలీస్‌లో చిన్న కారణాలకే పెద్ద దూరాలు ఏర్పడుతాయి. కొందరు జీవితాంతం కలవకూడదనే స్థితికి కూడా వెళ్తారు… కానీ రక్తసంబంధాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి” అని స్పష్టం చేశారు.
ముంబయిలో ఉండడం వల్ల కుటుంబ విషయాల్లో తాను పట్టించుకోలేదనే ప్రచారం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ— “నిజానికి నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నా సైలెన్స్‌ను తప్పుగా అర్థం చేసుకుని ఎవరి తలకి వచ్చిందే రాశారు. పర్సనల్ విషయాలను మీడియాతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు” అని తెలిపారు.
తన కుటుంబం ఇలా చీలిపోతుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పిన లక్ష్మి, “ఫ్యామిలీ కోసం పోరాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. దూరం పెంచుకోవడం ఎప్పుడూ పరిష్కారం కాదు. ప్రయత్నం చేస్తే ఒకరోజు ఫలితం తప్పక వస్తుంది” అంటూ భావోద్వేగంగా చెప్పారు.
Recent Random Post:















