
దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఇటీవల తన మార్క్ లవ్ స్టోరీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “థగ్ లైఫ్” చిత్రంతో బిజీగా ఉన్న ఆయన, ఆ సినిమా విడుదల అనంతరం లవ్ స్టోరీపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ సినిమా కథ ఇప్పటికే సిద్ధమై ఉండగా, ఇందులో కొత్త నటీనటులకు అవకాశం ఉంటుందని మణిరత్నం హింట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తెలుగు యువ హీరో నవీన్ పొలిశెట్టికి మణిరత్నం సినిమాలో కీలక పాత్రలో అవకాశం రావచ్చని కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా మొత్తం నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుందట. అందులో ఓ పాత్ర కోసం నవీన్ పొలిశెట్టిని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇదే నిజమైతే, నవీన్ కెరీర్లో భారీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పటికే “జాతిరత్నాలు”, “మిస్ పొలిశెట్టి మిస్టర్ పొలిశెట్టి” వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో “అనగనగా ఒక రోజు” అనే ఒక్క సినిమా మాత్రమే ఉంది.
అయితే మణిరత్నం సినిమాలో లవ్ స్టోరీ పాత్ర దక్కితే, నవీన్ పొలిశెట్టి “లవర్ బోయ్” ఇమేజ్‌తో మరింత ఎదిగే అవకాశం ఉంది. నవీన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో, సరైన కథ దొరికితే అతడి కెరీర్ మరో లెవెల్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం మణిరత్నం “థగ్ లైఫ్” పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా విడుదలైన తర్వాతే ఆయన కొత్త లవ్ స్టోరీపై క్లారిటీ వస్తుంది. మరి ఈ అదృష్టం నవీన్ పొలిశెట్టిని వరిస్తుందా? వేచి చూడాలి!
Recent Random Post:















