మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత అత్యంత ఆసక్తి రేకెత్తించిన ప్రాజెక్టుల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. పైగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ విజువల్ వండర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందనే ప్రచారం మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
అయితే సినిమా ప్రారంభ దశలో ఏర్పడిన ఆ భారీ అంచనాలకు టీజర్ మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ క్వాలిటీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంత పెద్ద బడ్జెట్, ఇంత పెద్ద హీరో ఉన్న ప్రాజెక్ట్‌కు ఇవేనా విజువల్స్ అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దాంతో సినిమాపై ఉన్న హైప్ కొంత మేర తగ్గిపోయింది.
టీజర్‌పై వచ్చిన నెగటివ్ ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకున్న ‘విశ్వంభర’ టీం వెంటనే విజువల్ ఎఫెక్ట్స్‌పై మళ్లీ పని ప్రారంభించింది. భారీగా రీవర్క్ చేయాల్సి రావడంతో గత ఏడాది సంక్రాంతికి అనుకున్న రిలీజ్ వాయిదా పడింది. ఈసారి కూడా పండక్కి కాకుండా, వేసవి విడుదల లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ మధ్యలో చిరంజీవి నటించిన మరో చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలై భారీ విజయం సాధించింది. సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటింది. దీంతో చిరంజీవి టీం ఫోకస్ మళ్లీ ‘విశ్వంభర’ వైపు మళ్లాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మెగా అభిమానులు ఈ స్థాయిలో ఊపుమీద ఉన్న సమయంలోనే ‘విశ్వంభర’ నుంచి ఒక బలమైన అప్డేట్ రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో విమర్శలు ఎదుర్కొన్న విజువల్స్‌నే ఇప్పుడు ప్రధాన బలంగా మార్చి చూపించగలిగితేనే సినిమాకు తిరిగి హైప్ వచ్చే అవకాశముంది. చాలా కాలంగా విజువల్స్, వీఎఫ్ఎక్స్పై కష్టపడ్డ వశిష్ఠ టీం తాము చేసిన మార్పులను ఒక పవర్ఫుల్ గ్లింప్స్ ద్వారా చూపిస్తే, సినిమాపై నమ్మకం తిరిగి ఏర్పడుతుంది. అదే జరిగితే వేసవి రిలీజ్‌కు గ్రౌండ్ లెవెల్ హైప్ సెట్ అవుతుంది.
Recent Random Post:















