
దంగల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రంలో కూడా ఆమీర్ ఖాన్‌కు జోడీగా నటించారు. సినిమాల్లో ఆమె నటనకన్నా, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటీవల ఫాతిమా ఓ తమిళ సినిమా షూటింగ్ సమయంలో తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని వెల్లడించింది. ఆ సమయంలో కొన్ని సంఘటనలు తాను ఊహించని రీతిలో జరిగాయని, వాటిని వక్రీకరించి మీడియాలో చూపించారని ఆమె గంభీరంగా స్పందించింది. సౌత్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఇప్పటికే థియేటర్లలో విడుదలైన అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన మెట్రో… ఇన్ డినో సినిమా మంచి స్పందన పొందింది. ఈ విజయంతో ఫాతిమా సనా షేక్ జోరుమీద ఉన్నారు. తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో మీడియాతో మాట్లాడిన ఫాతిమా, తన జీవితంలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని షేర్ చేశారు.
ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి తాను ఊహించని రీతిలో అనుచితంగా ప్రవర్తించాడని చెప్పారు. అతడి ప్రవర్తనతో షాక్‌కి గురైన ఫాతిమా, అతనికి చెంపపై ఒక్కటి కొట్టానని చెప్పారు. కానీ అతను కూడా ప్రతిగా తన్నడంతో నేలకూలిపోయానని, ఆ దృశ్యం నుంచి తేరుకోవడానికి సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబై వీధుల్లో సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఓ ట్రక్ డ్రైవర్ తనను గుర్తించి వెంబడించాడని, పదే పదే హార్న్ కొడుతూ తనను ఇబ్బంది పెట్టాడని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ముంబై వంటి పెద్ద నగరాల్లో సాధారణంగా జరుగుతున్నాయని, కానీ సెలబ్రిటీగా ఉండటం వల్ల అవి హైలైట్ అవుతున్నాయని అన్నారు.
తను సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లపైనా ఆసక్తి చూపుతుందని చెప్పారు. ఇక పెళ్లిపై తనకు పెద్దగా నమ్మకం లేదని గతంలో చెప్పిన వ్యాఖ్యలపై కూడా మరోసారి చర్చ మొదలైంది. అలాగే సౌత్ ఇండస్ట్రీపై ఆమె చేసిన కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recent Random Post:















