మరో మలయాళ రీమేక్ లో వెంకటేష్?

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ మొదలైనప్పటి నుండి రీమేక్స్ అంటే ఆసక్తి చూపిస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే. రీమేక్స్ తో మాగ్జిమమ్ విజయాలను అందుకున్న వెంకటేష్ రీసెంట్ గా రెండు రీమేక్స్ లో నటించాడు. వెంకటేష్ తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రాన్ని నారప్పగా రీమేక్ చేయగా, మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం2 చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసాడు.

ఈ రెండు సినిమాలు కాకుండా ఇప్పుడు వెంకటేష్ మరో రీమేక్ పై ఆసక్తి చుపిస్తున్నాడట. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని వెంకటేష్ రీమేక్ చేస్తాడని అంటున్నారు. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఈగోల నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ రీమేక్ విషయంలో ఇంకా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.


Recent Random Post: