మాలీవుడ్ విమర్శలకు జాన్వీ సమాధానం

Share


సిద్దార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా నటించిన పరమ్ సుందరి సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ కపూర్ మలయాళ యువతి దీక్షా పట్టా సుందరై దామోదరం పిళ్లై పాత్రలో కనిపించబోతోంది.

అయితే జాన్వీ మలయాళ యువతి పాత్ర పోషించడంపై మాలీవుడ్ నుంచి కొంత విమర్శ వస్తోంది. ఒక హిందీ నటి స్థానిక అమ్మాయి పాత్ర చేయడం ఎందుకని కొంతమంది మాలీవుడ్ న‌టీమణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ఆ పాత్రను మరింత బాగా చేయగలమని, కానీ పెద్ద ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటీమణుల వలన తమలాంటి వారికి అవకాశాలు దొరకడం లేదని వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ విమర్శలపై తాజాగా జాన్వీ కపూర్ స్పందిస్తూ పరిస్థితిని సమర్థవంతంగా హ్యాండిల్ చేసింది. “పరమ్ సుందరిలో నేను కేవలం మలయాళ యువతిగానే కాకుండా, తమిళ యువతిగానూ కనిపిస్తాను. నా మూలాలు కేరళలో లేవు, నేను కూడా, నా తల్లి శ్రీదేవి కూడా మలయాళీలు కాదు. కానీ ఆ రాష్ట్రపు సంస్కృతి, సంప్రదాయాలు, క్రమశిక్షణ ఎప్పుడూ నాకు గౌరవమే. ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయి పాత్ర చేయడం నాకు అదృష్టం” అని చెప్పింది.

అదేవిధంగా, ఓనం పండుగ ప్రత్యేకత గురించి ప్రస్తావిస్తూ, అవకాశం వస్తే మాలీవుడ్‌లోనూ సినిమాలు చేయాలని తన కోరికను తెలిపింది.

మొత్తానికి జాన్వీ కపూర్‌పై వస్తున్న విమర్శలు తాత్కాలికంగా ఆగే సూచనలు కనబడుతున్నాయి. ఎలాంటి సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి అనేది దర్శకుడి నిర్ణయం. ఏ ప్రాంతపు పాత్రనైనా నటి చేయడం సహజమే. కానీ జాన్వీ శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమెనే టార్గెట్‌గా చేసుకున్నట్లు అనిపిస్తోంది.


Recent Random Post: