
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ కు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌లు తగ్గినప్పటికీ, ఆయన ఎనర్జీకి, మాస్ ఆకర్షణకు మాత్రం ఏమాత్రం తగ్గుదల లేదన్నది స్పష్టమవుతోంది. 2022లో వచ్చిన ‘ధమాకా’ మూవీతో సోలో హీరోగా బ్లాక్‌బస్టర్ అందుకున్న రవితేజ, ఆ తరువాత వాల్తేరు వీరయ్య వంటి మల్టీస్టారర్ చిత్రంలో మెగాస్టార్ తో కలిసి మరో హిట్ అందుకున్నాడు.
అయితే ఆ తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయినా రవితేజపై ఉన్న ప్రొడ్యూసర్ల నమ్మకం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజాగా ఇదే బ్యానర్ రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తోంది. ‘MAD’ ఫ్రాంఛైజీకి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్ ఒక ఫాంటసీ కామెడీ కథతో రవితేజను కలిసి వినిపించారట. కథ వినగానే రవితేజ చాలా ఆసక్తి చూపారన్న టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో చిత్రానికి అంగీకారం చెప్పిన నేపథ్యంలో, కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావాలంటే కొంత టైమ్ పట్టేలా ఉంది.
ఇంకా ఒక కీలక అంశం ఏంటంటే, ‘మాస్ జాతర’ చిత్రం విజయం ఆధారంగా కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట సితార ఎంటర్టైన్మెంట్స్. మార్కెట్లో నాన్-థియేట్రికల్ డీల్స్ ఎలా క్లోజ్ అవుతాయన్న దానిపై కూడా ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. మంచి డీల్ వస్తే సినిమా మొదలవుతుంది. లేకపోతే తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది.
ఇక రవితేజ – కళ్యాణ్ శంకర్ కాంబినేషన్, యూత్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్కు మంచి ఫిట్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘MAD’ తరహాలో ఫన్, ఫాంటసీ, కామెడీ అడ్డగా రవితేజ ఎనర్జీ జోడైతే, మరో మాస్ హిట్ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పుడు ఆసక్తికరమైంది ఏంటంటే — ‘మాస్ జాతర’ ఫలితం ఎలా ఉంటుందన్నదే… అదే ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దిశను నిర్దేశించనుంది.
Recent Random Post:















