
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశంపై గత కొన్నేళ్లుగా విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మీటూ ఉద్యమ సమయంలో అనేక మంది నటీమణులు సహచరుల వేధింపులపై ఆరోపణలు చేసి, ఫిర్యాదులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా అరెస్టులు, పోలీసు విచారణలు జరిగాయి. ఈ కేసులు కొన్ని ఇప్పటికీ కోర్టుల్లో కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక, గత కొన్ని సంవత్సరాలుగా మీటూ ఉద్యమం సినీ పరిశ్రమపై విస్తృతమైన ప్రభావాన్ని చూపింది. క్రమశిక్షణ లేమి, సెట్స్‌లో మహిళల పట్ల దుర్వ్యవహారం వంటి అంశాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అనే ప్రశ్నకు ఇటీవల దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
తన అనుభవం పంచుకుంటూ ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ, “ఇప్పటి పరిస్థితులు చాలావరకు మారాయి. సెట్స్‌లో లైంగిక వేధింపులు, దుర్వ్యవహారం తగ్గాయి. మీటూ ఉద్యమం బాలీవుడ్‌ను మరింత జవాబుదారీగా, క్రమశిక్షణతో నడవడానికి కారణమైంది. సెట్లో ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయడం, వేధింపులపై వెంటనే దర్యాప్తు చేయడం వంటి చర్యలు మహిళలకు రక్షణను కల్పించాయి. ఫలితంగా, వేధింపుల ఘటనలు గణనీయంగా తగ్గాయి,” అని వివరించారు.
తనకు వ్యక్తిగతంగా లైంగిక వేధింపులు ఎదురుకాలేదని ఫాతిమా స్పష్టం చేశారు. అయితే, కొన్ని అసౌకర్యకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. ఈ క్రమంలో ఓటీటీ కంపెనీలు కూడా సెట్స్‌లో వేధింపులను నివారించేందుకు చేసిన ప్రయత్నాలను ఫాతిమా అభినందించారు.
మొత్తంగా, మారిన పరిస్థితులపై ఫాతిమా తనదైన శైలిలో అభిప్రాయం పంచుకున్నారు. సినీ పరిశ్రమ మాత్రమే కాకుండా, అన్ని రంగాల్లోనూ పరిస్థితులు మారాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. లైంగిక వేధింపుల నివారణకు పివోఎస్హెచ్ (POSH) వంటి చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని అందరూ అభిప్రాయపడ్డారు.
Recent Random Post:















