
మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై చివరగా ఫుల్ లెంగ్త్ కామెడీ చేయడం చాలా కాలమైంది. కంబ్యాక్ తర్వాత ఆయన మాస్, యాక్షన్ సినిమాలకే ఎక్కువగా మొగ్గుచూపారు. ‘వాల్తేరు వీరయ్య’లో కామెడీ టచ్ ఉన్నా, అది పూర్తిస్థాయి హాస్య చిత్రంగా చెప్పలేం. అయితే, ఈ గ్యాప్‌ను పూరించేందుకు అనీల్ రావిపూడి తీసుకున్న స్క్రిప్ట్ చిరంజీవికి బాగా నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పారు.
ఇది ఓ పక్కా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. అనీల్ రావిపూడి తన మార్క్ స్క్రీన్‌ప్లేతో మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా కథ సిద్ధం చేశాడు. చిరు ఈ కథకు ఎంతగా కనెక్ట్ అయ్యారో చెప్పాల్సిన అవసరమే లేదు – ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చేశారు. చాలా ఏళ్ల తర్వాత తాను చేస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ ఇదేనని స్వయంగా చెప్పిన చిరు, షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.
ఇక ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఒక పాత్ర పూర్తిగా హాస్యపరంగా ఉంటే, మరోటి మాస్ యాంగిల్లో సీరియస్ టోన్‌లో సాగుతుందని తెలుస్తోంది. చిరు నటనలో కామెడీ టాలెంట్‌ను మరోసారి తెరపై చూపించేందుకు అనీల్ రావిపూడి అన్ని హంగులతో కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
మెగాస్టార్ సినిమాల్లో నవ్వులు, యాక్షన్, ఎమోషన్ అన్నీ సమపాళ్లలో ఉండాలి. అదే అంజనేయసూత్రంగా అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. అభిమానులకు చిరు మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ అవతారంలో కనిపించనుండడం నిజంగానే రసవత్తరమైన విషయమే!
Recent Random Post:















