
2016లో నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పంజాబీ బ్యూటీ మెహరీన్, తక్కువ కాలంలోనే పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె ఎఫ్2 లో వరుణ్ తేజ్ కు జోడీగా నటించి, ఆ సినిమాలోని “హనీ ఈజ్ ది బెస్ట్” అనే డైలాగ్ ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ సినిమాతోనే మెహరీన్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు పొందారు.
అయితే 2021 మార్చిలో హర్యానాకు చెందిన భవ్య బిష్ణోయ్‌తో మెహరీన్ ఎంగేజ్మెంట్ జరగగా, బిష్ణోయ్ బీజేపీ తరఫున అడంపూర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ ఎంగేజ్మెంట్ రద్దు అయ్యింది. గడిచిన కొన్నాళ్లుగా మెహరీన్ మరో వ్యక్తితో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వెలువడ్డాయి.
ఇలాంటి వార్తలపై మెహరీన్ తాజాగా కఠిన అసహనాన్ని వ్యక్తం చేశారు. తనకు పరిచయం లేని వ్యక్తితో పెళ్లి జరిగిందంటూ ప్రచారం చేయడం అసహ్యం, గత రెండు సంవత్సరాలుగా ఇలాంటి అంశాలపై మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు స్పందించక తప్పదని ఆమె చెప్పారు. “నేను ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాస్తున్నారు. కానీ నేనెవరినీ పెళ్లి చేసుకోలేదు. భవిష్యత్తులో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆ విషయాన్ని స్వయంగా ప్రపంచానికి తెలియజేస్తాను. దయచేసి నా పెళ్లి గురించి ఎలాంటి ప్రచారం చేయకండి” అని ఆమె విజ్ఞప్తి చేశారు.
కెరీర్ విషయానికి వస్తే, ఎఫ్3 తరువాత మెహరీన్ స్పార్క్ అనే తెలుగు సినిమాలో నటించారు. మధ్యలో ఒక వెబ్ సిరీస్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో కెరీర్లో గ్యాప్ వచ్చింది, కానీ అది తనకవసరమైన గ్యాప్ కాదని చెప్పారు. ప్రస్తుతం మెహరీన్ కన్నడలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Recent Random Post:















