యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన పాన్ ఇండియా సెన్సేషన్ ‘RRR’. జక్కన్న అత్యం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ వైరల్డ్ వైడ్ గా సంచలనాలు షృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ‘RRR’ అంతర్జాతీయ వేదికలపై పలు కీలక పురస్కారాలని బ్యాక్ టు బ్యాక్ తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది. రీసెంట్ గా న్యూ యార్క్ క్రిటిక్స్ అవార్డుని ఉత్తమ దర్శకుడి కేటగిరిలో రాజమౌళి దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ రెండు విభాగాల్లో నామినేషన్స్ ని సాధించిన విషయం తెలిసిందే. జనవరి 10న కాలిఫోర్నియాలో ఈ అవార్డులు వేడుక జరగబోతోంది. ఇప్పటికే యుఎస్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో వున్న ఎన్టీఆర్ జనవరి 10న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో పాల్గొనబోతున్నాడు. తనతో పాటు ఈ అవార్డుల వేడుకలో దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నారు.
ఇదిలా వుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానం జరగనున్న జనవరి 10న హైదరాబాద్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్తర్యేకంగా సమావేశం కానున్నడని వార్తలు మొదలయ్యాయి.
గతంలో టీడీపీ ప్రచారం చేసిన ఎన్టీఆర్ మళ్లీ వస్తున్నాడని త్వరలో లోకేష్ ఈ నెలాఖరున చేయమబోతున్న పాదయాత్రకు మద్దుతుగా నిలవనున్నాడని ఈ విషయంపైనే నారా చంద్రబాబు నాయుడుతో ఎన్టీఆర్ జనవరి 10న ప్రత్యేకంగా సమావేశం కానున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుక జనవరి 10న కాలిఫోర్నియాలో జరగబోతోంది. అందులో ఎన్టీఆర్ ‘RRR’ టీమ్ తో కలిసి పాల్గొనబోతున్నాడు. అక్కడ వుండాల్సిన ఎన్టీఆర్ అదే రోజు హైదరాబాద్ లో వుండటం అన్నది హైలీ ఇంపాజిబుల్.. అంటే ఎన్టీఆర్ జనవరి 10న నారా చంద్రబాబు నాయుడుని ప్రత్యేకంగా కలుస్తున్నారన్నది ఒట్టి రూమరే అని తేలిపోయింది. తాజాగా ఎన్టీఆర్ పై వినిపిస్తున్న వార్త టీడీపీ శ్రేణుల్ని కూడా విస్మయానికి గురిచేసిందట.
ఇదిలా వుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను నటించనున్న 30వ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ని ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు.
Recent Random Post: