రంగీలా ‘హై రామా’ ట్యూన్ కోసం రెహమాన్ చేసిన అలజడి – ఆర్జీవీ ఫన్నీ రివీల్

Share


తనదైన సృజనాత్మకతతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న స్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్, ఎన్నో దిగ్గజ దర్శకులతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. మణిరత్నం, ఆర్జీవీ వంటి డైనమిక్ ఫిల్మ్‌మేకర్లతో ఆయన మ్యాజిక్ క్రియేట్ చేశారు. 90లలో ఆర్జీవీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ రంగీలాకు రెహమాన్ అందించిన సంగీతం అసలు చెప్పలేనంత సెన్సేషన్.

ఈ సినిమాలోని ‘యాయిరే యాయిరే’ పాట అప్పట్లో దేశాన్ని ఒకే ఊపు ఊపింది. ఊర్మిల ఆకర్షణీయమైన డ్యాన్స్‌లు, రెహమాన్ అందించిన అద్భుత బాణీ ఆ పాటను స్మరణీయంగా నిలబెట్టాయి. అలాగే ‘హై రామా’ అనే రొమాంటిక్ సాంగ్ భారతీయ సినిమాల్లోకి ఒక కొత్త ఒరవడిని తెచ్చింది. జాకీ ష్రాఫ్ – ఊర్మిల జంట కెమిస్ట్రీని ఎడారి బ్యాక్‌డ్రాప్‌లో ఆర్జీవీ విజువల్‌గా అద్భుతంగా మలిచారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆర్జీవీ ఈ పాటల గురించి మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘హై రామా’ ట్యూన్‌ను సిద్ధం చేసేందుకు రెహమాన్ తనను ఎంతగా పడేసారో నవ్వుతూ చెప్పారు. ఐదు రోజుల్లో ట్యూన్ కావాలనగా, ప్రతి రోజూ రెహమాన్ ఏదో ఒక చిన్న షాక్ ఇస్తూ వచ్చారట.
“ఈరోజు ట్యూన్ తయారుకాలేదు… రేపు పంపిస్తాను”
“మరునాడు అయ్యే అవకాశం ఉంది…”
ఇలా రోజుకొక సారీ మాటమారుస్తూ టెన్షన్ పెంచారట. చివరి రోజుకి వచ్చేసరికి —
“నేను చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి ట్యూన్ పంపుతాను” అని చెప్పారట!

ఇంకా ఆర్జీవీ నవ్వుతూ చెప్పిన ఫన్నీ పంచ్ ఏమిటంటే — హోటల్ రూమ్‌లో టీవీ ఉంటే తాను కూర్చుని టీవీ మాత్రమే చూస్తూ ఉంటానని, అందుకే ట్యూన్ ఆలస్యమయ్యిందని రెహమాన్ చెప్పారని… ఆ సమాధానం విన్న వెంటనే “ఒకటి కొట్టాలనిపించింది” అని సరదాగా చెప్పాడు ఆర్జీవీ. అయితే ట్యూన్ వచ్చాక మాత్రం ఆశ్చర్యపోయేలా ఉందని, చివరకు బాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయిందని చెప్పాడు.

రంగీలాకి మొత్తం 9 ఫిలింఫేర్ అవార్డులు లభించగా, రెహమాన్‌కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు దక్కింది. జాకీ ష్రాఫ్ ఉత్తమ సహాయ నటుడుగా ఫిలింఫేర్ అందుకున్నారు. నాలుగు కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా అప్పట్లో 33 కోట్ల భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.


Recent Random Post: