
సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి అంచనాలకు మించి ఓపెనింగ్ సాధించింది. సోషల్ మీడియాలో “ఫ్యాన్స్‌ని పూర్తిగా సంతృప్తి పరచలేదని” కొంతమంది చెబుతున్నా, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రధాన థియేటర్లన్నీ వీకెండ్ వరకు హౌస్‌ఫుల్ అవడం ఖాయం. తమిళనాడులో ఆదివారం వరకు టికెట్లు పూర్తిగా సేల్ అవగా, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టాక్ డివైడ్‌గా ఉన్నా, ఎక్కువ మంది ప్రేక్షకులు ఒక్కసారి అయినా కూలి చూడాలని నిర్ణయించుకున్నట్టున్నారు.
సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించిన ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ 151 కోట్లు. ఈ సంఖ్యతో, ఇంతకుముందు లియో పేరుమీద ఉన్న రికార్డును అధిగమించింది. ముఖ్యంగా, ఫ్యాన్స్ కోసం అంకెలను కృత్రిమంగా పెంచే ప్రయత్నం చేయకుండా, నిజమైన వసూళ్లను ప్రకటించడం విశేషం. రజనీకాంత్ స్టార్ పవర్ మరోసారి రుజువైంది. అయితే, టాక్ ప్రభావం బుకింగ్స్ మీద పడటం నిజమే. ఆశించిన దానికన్నా ట్రెండ్ కొంచెం నెమ్మదిగా ఉన్నా, వార్ 2 పై స్పష్టమైన ఆధిపత్యం కలెక్షన్లలో కనిపిస్తోంది. ట్రేడ్ టాక్ ప్రకారం, తెలుగు వెర్షన్ 20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
కూలికి అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. వీకెండ్ తర్వాత కూడా ఇదే ఉత్సాహం కొనసాగాలి, వసూళ్లలో తీవ్రమైన డ్రాప్ లేకూడదు. సోషల్ మీడియాలో నడుస్తున్న నెగటివ్ క్యాంపైన్‌ను ప్రేక్షకులు ఎంత సీరియస్‌గా తీసుకుంటారనేది కీలకం. వార్ 2 కంటే కంటెంట్ బెటర్ అనిపించడం కూలికి బలంగా నిలుస్తుంది. అయితే రజనీకాంత్, లోకేష్, నాగార్జున కాంబినేషన్‌పై అధిక అంచనాలు పెట్టుకున్న సాధారణ ప్రేక్షకులు కొంత నిరాశ చెందుతున్నారని, తమ అభిప్రాయాన్ని ఎక్స్ పోస్టుల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. లియోకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు కూలి ఈ సవాళ్లను తట్టుకుని టార్గెట్ చేరుతుందో లేదో చూడాలి.
Recent Random Post:















