
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే Thalaivar 173 ప్రాజెక్ట్‌కు సినీ వర్గాల్లో, అభిమానుల్లో అపారమైన క్రేజ్ నెలకొంది. ఇండస్ట్రీలో చాలా అరుదుగా కనిపించే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండటం సహజమే. ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా, దర్శకుడిగా సి. సుందర్ పేరు ప్రకటించబడింది. అయితే అనుకోని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ, రజనీ–కమల్ అభిమానులకు క్షమాపణలు తెలిపారు.
సుందర్ వెనక్కి తగ్గిన తర్వాత, ఈ మల్టీ-స్టారర్‌కు కొత్త దర్శకుడు ఎవరు అన్న దానిపై ఊహాగానాలు ఉధృతమయ్యాయి. మొదట్లో లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ పేర్లు వినిపించినా, అధికారిక క్లారిటీ రాలేదు. తాజాగా పార్కింగ్ మూవీ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన చెప్పిన కథ రజనీకాంత్, కమల్ ఇద్దరికీ నచ్చడంతో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్.
ఇప్పుడేమో ఈ యంగ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రామ్ కుమార్ బాలకృష్ణన్‌కు ఈ చిత్రానికి ఏకంగా రూ. 10 కోట్లు పారితోషికంగా ఇవ్వనున్నట్లు ప్రచారం. ఇది అందరికీ షాక్ గా మారింది, ఎందుకంటే పార్కింగ్ చిత్రానికి ఆయన కేవలం రూ. 6 లక్షలు మాత్రమే తీసుకున్నారు. ప్రస్తుతం శింబుతో చేస్తున్న తన కొత్త చిత్రానికి రూ. 2 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు రజనీ–కమల్ లాంటి భారీ ప్రాజెక్ట్ కోసం ఒక్కసారిగా రూ. 10 కోట్ల రేంజ్‌లోకి రావడం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చగా మారింది.
రెండు సంవత్సరాల్లోనే రూ. 6 లక్షల నుండి రూ. 10 కోట్ల వరకు ఎదగడం నిజంగా గమనార్హం. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బాలకృష్ణన్ కూడా రజనీ–కమల్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నట్లు పబ్లిక్‌గా వెల్లడించలేదు.
Recent Random Post:















