
ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్ల కోసం రియాలిటీ షోలలో పాల్గొంటూ సందడి చేయడం సాధారణంగా మారింది. ప్రముఖ స్టార్లు కూడా ఈ ట్రెండ్‌లో భాగమై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేరింది.
రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో, కాగా తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నవంబర్ 14న విడుదల కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రష్మిక భారీగా ప్రమోషన్లు చేస్తోంది.
ఇటీవల బిగ్ బాస్ తెలుగు 9లో గెస్ట్‌గా హాజరై తన సినిమాను ప్రమోట్ చేసిన రష్మిక, ఇప్పుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో పాల్గొంది. ఆ ఎపిసోడ్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగపతిబాబు మాట్లాడుతూ, “నీవు మగవారికి కూడా పీరియడ్స్ రావాలని అనుకుంటావట కదా?” అని అడగగా, రష్మిక వెంటనే స్పందిస్తూ – “అవును, మగవారికి కూడా పీరియడ్స్ రావాలి. అప్పుడే వారు ఆడవారు పడే నొప్పి, బాధ, నరకం ఏంటో అర్థం అవుతుంది,” అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.
ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే – ఆమె కన్నడ ఇండస్ట్రీలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో రంగప్రవేశం చేసింది. ఆ సినిమా సమయంలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి నిశ్చితార్థం చేసుకున్న రష్మిక, ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుని తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.
‘చలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక, తరువాత ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప’ వంటి వరుస విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’, ‘యానిమల్’, ‘ఛావా’, ‘కుబేర’, ‘థామా’, ‘సికందర్’, ‘మైసా’, ‘రెయిన్బో’ వంటి పలు చిత్రాలతో బిజీగా ఉంది.
Recent Random Post:















