
యంగ్ హీరో Sangeeth Shoban నటిస్తున్న తాజా చిత్రం రాకాస విడుదలకు సిద్ధమవుతోంది. Manasa Sharma దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను Niharika Konidela నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ దర్శకురాలు మానస శర్మతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “మానస శర్మతో నాకు 2021 నుంచి పరిచయం ఉంది. అప్పటి నుంచి మేము తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలాంటి విషయమైనా ఓపెన్‌గా డిస్కస్ చేసుకుంటాం,” అని తెలిపారు.
సినిమా పట్ల ఆమె దృక్పథాన్ని ప్రశంసిస్తూ, “సినిమా అంటే రిలీజ్ చేసి వదిలేయడం కాదు.. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు. ఆడియన్స్‌కి గౌరవం ఇచ్చే వ్యక్తి ఆమె. టికెట్‌కు పూర్తి విలువ ఇవ్వాలనే ధోరణితో పని చేస్తారు,” అని సంగీత్ శోభన్ పేర్కొన్నారు.
Recent Random Post:















