రామాయణంలో మండోదరిగా కాజల్?

Share


దంగ‌ల్‌ సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన ద‌ర్శ‌కుడు నితేష్ తివారి ప్ర‌స్తుతం భారతీయ ప్రాచీన ఇతిహాసం రామాయ‌ణంను అత్యాధునిక సాంకేతికత‌తో తెర‌కెక్కిస్తున్నారు. శ్రీధర్ రాఘవన్ కథ అందిస్తుండగా, న‌మిత్ మల్హోత్రా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని న‌మిత్ మల్హోత్రా, హీరో య‌ష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ర‌ణ్‌బీర్ క‌పూర్ శ్రీరాముడిగా, సాయిప‌ల్ల‌వి సీతాదేవిగా నటిస్తున్నారు. య‌ష్ రావ‌ణాసుడిగా నటించనున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సీనియర్ హీరో సన్నీ డియోల్ కనిపించనున్నాడు.

ఇటీవ‌ల ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర సమాచారం ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్రేజీ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్‌లో కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ట‌. ఆమె రావ‌ణాసురుడి భార్య మండోద‌రిగా నటించనుంద‌ని టాక్ వినిపిస్తోంది. య‌ష్‌కు జోడీగా ఈ పాత్రలో కాజ‌ల్ లుక్ టెస్ట్ కూడా పూర్త‌యింద‌ట‌. త్వరలోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్త నిజ‌మైతే రామాయ‌ణం ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి స్టార్ కాస్టింగ్‌ను జోడించ‌డం ద్వారా ఇది భారతీయ సినిమా చరిత్రలో మ‌రొక మైలురాయిగా నిల‌వ‌నుంద‌ని విశ్లేషకుల అభిప్రాయం.


Recent Random Post: