
బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, కైకయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా రవి దూబే, సూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, త్వరలో సన్నీ డియోల్ కూడా సెట్స్‌లో చేరనున్నాడు. పాత్ర గురించి మాట్లాడిన సన్నీ డియోల్, భగవంతుడి దయ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, దేవుడిపై తనకు నమ్మకం ఉన్నదని చెప్పారు. హనుమంతుడి పాత్ర తనకు ఒక సవాల్‌గా అనిపిస్తోందని, అయితే ఇలాంటి పాత్రలు తనకు చాలా ఇష్టమని తెలిపారు. సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కుతోందని, ప్రేక్షకులు ఆశ్చర్యపోవాల్సిందేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రామాయణం ‘అవతార్’, ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ తరహాలో ప్రపంచస్థాయిలో తెరకెక్కుతుందని, విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని కూడా పేర్కొన్నారు. ప్రేక్షకులను కొత్త లోకాల్లోకి తీసుకెళ్లే ఈ సినిమా గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందుతోందని అభిప్రాయపడ్డారు.
ఇక సన్నీ డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాట్’ అనే చిత్రంలో కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులోనూ ఈ చిత్రం కొన్ని రోజుల గ్యాప్‌లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం సన్నీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
Recent Random Post:















