
Baahubali: The Beginning విడుదల తర్వాత టాలీవుడ్లో భారీ చిత్రాల నిర్మాణానికి కొత్త ఊపొచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయం తెలుగు సినిమా మార్కెట్‌ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అప్పటివరకు రూ.40–50 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయడానికే వెనుకాడిన నిర్మాతలు, ఆ తర్వాత వందల కోట్ల పెట్టుబడులకు కూడా ముందుకు రావడం ప్రారంభించారు. Saaho, Ala Vaikunthapurramuloo, Sarileru Neekevvaru, Pushpa 2: The Rule వంటి సినిమాలు భారీ బడ్జెట్లతో రూపొందాయి. అదే సమయంలో RRR, Kalki 2898 AD చిత్రాలు టాలీవుడ్ బడ్జెట్ పరిమితులను పూర్తిగా చెరిపేసి కొత్త రికార్డులు నెలకొల్పాయి. ఇప్పుడు వంద కోట్లు అనేది టాలీవుడ్లో సాధారణ విషయమైపోయింది.
ఇప్పటి పరిస్థితి చూస్తే టాలీవుడ్ నిర్మాతలు రూ.1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికీ వెనుకాడని స్థాయికి చేరుకున్నారు. సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శకధీరుడు S. S. Rajamouli కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి (వర్కింగ్ టైటిల్) ఈ దిశలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ టచ్‌తో మైథాలజికల్ ఎలిమెంట్స్ మేళవింపుగా రాబోతోంది. హీరోయిన్గా Priyanka Chopra నటిస్తుండగా, కీలక పాత్రల్లో Prithviraj Sukumaran, Prakash Raj కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్రణాళికతో జక్కన్న ముందుకు సాగుతున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు పుష్ప ది రూల్‌తో గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన Allu Arjun కూడా మరింత పెద్ద లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన 22వ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ Atlee తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని Sun Pictures భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో Deepika Padukone కీలక పాత్రలో నటిస్తుండగా, Rashmika Mandanna మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. #AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రాబోతోంది.
ఇప్పటికే Prabhas, N. T. Rama Rao Jr., Ram Charan పాన్ ఇండియా స్టార్లుగా స్థిరపడ్డారు. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్లు భారీ విజువల్ వండర్స్‌తో టాలీవుడ్‌ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. టాలీవుడ్ ఇక కేవలం ప్రాంతీయ పరిశ్రమ కాదు; ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించిన శక్తివంతమైన ఇండస్ట్రీగా రూపుదిద్దుకుంటోంది.
Recent Random Post:















