ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న సంచలనానికి మొదటి అడుగు వేసిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి కన్న కలను నిజం చేసేందుకు తన ఐదేళ్ల కెరీర్ రిస్క్ లో పెట్టి మరీ బాహుబలి సినిమా చేశాడు. ఆ సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి తెలుగు సినిమా ముఖచిత్రం మారిపోయింది. బాహుబలి తర్వాత ఎన్నో సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ ఒక్కడు వేసిన బాటలో మిగతా స్టార్స్ అంతా నడుస్తున్నారు.
ప్రభాస్ కేవలం ఇక్కడ సినిమాలు చేసినప్పుడే అతని మాస్ కెపాసిటీ గురించి అర్థమైంది. ఇక బాహుబలి తర్వాత ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. అందుకే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రెబల్ హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫిక్స్ అయిపోయాడు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ కి అదే రేంజ్ లో మెగా బర్త్ డే విషెస్ అందించారు మెగాస్టార్ చిరంజీవి.
ఆ కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్.. అతను ప్రేమించే పద్ధతి చూసి తిరిగి ప్రేమిచేస్తాం అంటూ ప్రభాస్ కి వెరైటీ బర్త్ డే విషెస్ అందించారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ని రెబల్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సినిమాల మధ్య ఎంత ఫైట్ ఉన్నా ఇలాంటి సందర్భాల్లో ఒక హీరోని మరో హీరో విషెస్ అందించడం ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గా అనిపిస్తుంది.
ప్రభాస్ పై ఉన్న తనకున్న ప్రేమను ట్వీట్ రూపంలో తెలిపారు చిరంజీవి. ప్రభాస్ అందరికీ డార్లింగ్ ఎందుకు అంతే అతను చూపించే ప్రేమ అలా ఉంటుంది. అదే విషయాన్ని చెప్పిన చిరు ప్రభాస్ కటౌట్ చూసి అతను సృష్టిస్తున్న రికార్డులను నమ్మాల్సిందే అని చెప్పారు.
ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి మెగా మార్క్ విషెష్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి అయ్యేలా చేస్తున్నాయి. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో పక్క ప్రభాస్ రాజా సాబ్ ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. చిరంజీవి విశ్వంభర అసలైతే జనవరి లో సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు ఆ సినిమాను మార్చికి వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది.
Recent Random Post: