
బాలీవుడ్లో పోలీస్ యాక్షన్ కథలకు సునామీ తీసుకువచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి. యాక్షన్ సినిమాలంటే ఇష్టం ఉన్నవారికి సింగం నుంచి సూర్యవంశీ వరకు ఆయన సినిమాలు ప్రత్యేకమైన క్రేజ్‌ను తెచ్చాయి. అయితే ఇప్పటి వరకు రోహిత్ పూర్తిగా ఫిక్షనల్ పోలీస్ కథలకే పరిమితమయ్యాడు. కానీ ఈసారి, రియల్-లైఫ్ పోలీస్ కమిషనర్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే బాలీవుడ్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, రోహిత్ శెట్టి ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో బలమైన పోలీస్ పాత్రకు బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహామ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయిన నేపథ్యంలో మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేయాలని రోహిత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఏ సినిమా కూడా ఈంత తక్కువ టైమ్‌లో కంప్లీట్ చేయలేదు. దీంతో ఇది రోహిత్ కెరీర్లో ఓ అరుదైన రికార్డుగా నిలవనుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా పూర్తి చేసి, సినిమాను దాదాపు ప్లాన్ చేసిన టైమ్‌కే విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటోంది.
రియల్ సింగం – రాకేష్ మారియా
రాకేష్ మారియా పేరు ముంబైలో ఎలాంటి రేంజ్లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 1993 ముంబై బాంబు దాడులను చేధించడంలో కీలకపాత్ర పోషించాడు. 1981 నుంచి 2017 వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆయన ముంబై మాఫియాను గడగడలాడించిన స్ట్రాంగ్ కమిషనర్‌గా గుర్తింపు పొందాడు. పేరున్న గ్యాంగ్ స్టర్లను చక్కగా వలలో వేసి జైల్లో పెట్టడమే కాకుండా, రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేసిన గ్రేట్ కాప్‌గా చరిత్రలో నిలిచాడు.
ఇలాంటి పవర్ఫుల్ కథను రోహిత్ శెట్టి స్టైల్లో తెరకెక్కిస్తే, బాలీవుడ్లో మరో మైల్స్టోన్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి, ఈ ప్రాజెక్ట్ రియల్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి!
Recent Random Post:















