
ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో సంచలనంగా మారిన సినిమా లాపాటా లేడీస్. ప్రముఖ నటుడు ఆమీర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ఈ సినిమా 2025 ఆస్కార్ అవార్డుల రేసులో పోటీకి దిగింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రంపై కొత్త వివాదం చెలరేగింది. 2019లో విడుదలైన అరబిక్ లఘు చిత్రం బుర్కా సిటీ కధను కాపీ చేసి ఈ సినిమా తీశారనే ఆరోపణలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో బుర్కా సిటీకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవ్వడంతో, నెటిజన్లు బాలీవుడ్ ఒరిజినల్ సినిమాలను రూపొందిస్తున్నదా లేక కాపీ కథలకే అంకితమైందా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. బుర్కా సిటీ కథ ప్రకారం, ఒక కొత్త పెళ్లికొడుకు తన భార్యను వెతుకుతుంటాడు. అయితే పొరపాటున ఆమె స్థానంలో మరొకరిని తీసుకువచ్చిన తర్వాత చోటుచేసుకునే సంఘటనలే కథాంశంగా ఉంటాయి. ఇదే లైన్తో లాపాటా లేడీస్ రూపొందడంతో విమర్శలు మొదలయ్యాయి.
ఈ పరిణామంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “అంతటి స్టార్ హీరో భార్య, పేరున్న దర్శకురాలు ఇలా కాపీ కథను తీసి ఆస్కార్ రేసుకు పంపించడమేంటీ?” అని అనేక మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో ఒరిజినల్ కథలు కనుమరుగైపోయాయని, అనేక సినిమాలు ఇతర భాషల చిత్రాల కాపీలేనని విమర్శిస్తున్నారు.
కిరణ్ రావు ధోబీ ఘాట్ తర్వాత దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా, 2023లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శించబడింది. అక్కడ ప్రేక్షకుల నుండి స్టాండింగ్ ఒవేషన్ పొందిన ఈ చిత్రం, భారతదేశం తరఫున ఆస్కార్ రేసులో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీకి దిగింది. అయితే, ఇప్పుడు ఈ వివాదం సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:















