లైఫ్ పార్ట‌న‌ర్ జీవితాన్నే తారుమారు చేస్తుంది!

స‌హ‌జీవ‌నంపై ఒక్కొక్క‌రిది ఒక్కో అభిప్రాయం. పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు రిలేష‌న్ షిప్ లో ఉండ‌టం అన్నది స‌రైన భ‌విష్య‌త్ కు బాట‌ల వేస్తుంది? అన్న‌ది కొంద‌రి అభిప్రాయ‌మైతే…వివాహానికి ముందు క‌లిసి ఉండ‌టం అంటే? అదే భ‌విష్య‌త్ కి ప్ర‌మాద‌క‌రంగానూ మారుతుంద‌న్న‌ది మ‌రికొంత మంది అభిప్రాయం. ఈ అంశంపై హీరోలు, హీరోయిన్లు ఎంతో ఓపెన్ గా త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటారు.

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే కూడా త‌న అభిప్రాయాన్ని, అనుభ‌వాన్ని పంచుకున్నాడు. `నేను స‌హ‌జీవ‌నాన్ని న‌మ్ముతా. అలాగ‌ని ప్ర‌చారం చేయ‌ను. దీని గురించి బ‌హిరంగంగా మాట్లాడాలంటే భ‌య‌మేస్తుంది. ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో పెళ్లి అనేది ఓ పెద్ద అడుగు. ఆ ప్రయాణం మొదలు పెట్టే ముందు పెళ్లి చేసుకునే వ్య‌క్తిని పూర్తిగా అర్దం చేసుకోవ‌డం అన్న‌ది చాలా ముఖ్యం. స‌హ‌జీవ‌నం నా ప‌రంగా చాలా ఉప‌యోగ ప‌డింది.

అలాగ‌ని అంద‌రికీ అది ప‌నిచేస్తుంద‌ని నేను చెప్ప‌డం లేదు. నా భార్య‌, నేను ఒకే వృత్తిలో ఉన్నాం. క‌లిసి జీవించాల‌నుకున్నాం. పెళ్లికి ముందు ఒక‌ర్ని ఒక‌రు అర్దం చేసుకోవాల‌ని స‌హ‌జీవ‌నం మొద‌లు పెట్టాం. బాగా అర్ద‌మైంది. ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ఉండాలంటే ప్రేమ ముఖ్యం. స‌రైన భాగ‌స్వామిని ఎంచుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. భాగ‌స్వామి ఎంపిక అన్న‌ది మ‌న జీవితాల్నే మార్చేస్తాయి.

అది మంచికైనా..చెడుకైనా` అని అన్నాడు. విక్రాంత్ మాస్సే న‌టి శీత‌ల్ ఠాకూర్ ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందు డేటింగ్ అన్న‌ది అత‌డి సొంత అభిప్రాయం కాదు. విక్రాంత్ త‌ల్లి డేటింగ్ సూచించ‌డంతోనే పెళ్లికి ముందే కాపురం పెట్టాడు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసారు. అటుపై పెళ్లి చేసుకున్నారు. ఇటీవ‌లే క‌ర్వాచౌత్ పండుగ‌ సంద‌ర్భంగా భార్య కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి నెట్టింట హైలైట్ అయిన సంగ‌తి తెలిసిందే.


Recent Random Post:

Bachhala Malli Thirunaallu Live | Allari Naresh | Amritha Aiyer | Subbu Mangadevv

December 17, 2024

Bachhala Malli Thirunaallu Live | Allari Naresh | Amritha Aiyer | Subbu Mangadevv