లైలా మిస్ ఫైర్ తర్వాత ఫంకీతో కంబ్యాక్‌పై నమ్మకంగా విశ్వక్ సేన్

Share


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గత ఏడాది చేసిన లైలా సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే. రొటీన్‌కు భిన్నంగా, ఈ తరం యువ హీరోల్లో అన్ని రకాల పాత్రలు చేయాలనే తపనతో ముందుకెళ్తున్న విశ్వక్ సేన్, లేడీ గెటప్‌లో చేసిన ప్రయోగమే లైలా. అయితే ఈ సినిమా విషయంలో ఆయన అంచనాలు మాత్రం తప్పాయి. ప్రతి సినిమాకూ ఎంతో కష్టపడి బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని ప్రయత్నించే విశ్వక్ సేన్, గత మూడు నాలుగు చిత్రాల విషయంలో మాత్రం ట్రాక్ తప్పినట్టు కనిపించింది.

ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు విశ్వక్ సేన్ దర్శకుడు అనుదీప్‌తో కలిసి ఫంకీ సినిమాతో రాబోతున్నాడు. అనుదీప్ దర్శకత్వం అంటేనే యూత్ ఆడియన్స్‌కు గ్యారంటీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్న ఫీల్ ఉంది. ఫంకీ టీజర్‌తోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన ప్రతి సినిమా చూసిన తర్వాత తన తల్లి చాలా ఆనందపడేదని చెప్పిన విశ్వక్, లైలా సినిమా చూసిన తర్వాత మాత్రం ఆమె జాలి పడిందని అన్నారు. “అమ్మ కాబట్టి అంతకుమించి ఏమి అనలేదు. అప్పుడే లైలా సినిమా మిస్ ఫైర్ అయిందని నాకు అర్థమైంది” అంటూ ఓపెన్‌గా చెప్పాడు. అయితే ఫంకీతో మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానని విశ్వక్ సేన్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు.

ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డ్రాగన్ సినిమాతో యూత్ ఆడియన్స్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కయదు, తెలుగులో ఇప్పటికే శ్రీ విష్ణుతో ఓ సినిమా చేసినప్పటికీ అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ డ్రాగన్ తర్వాత తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది.

విశ్వక్ సేన్ – కయదు లోహర్ జోడీ ఫంకీకి ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇకపై తన సినిమాల విషయంలో మరింత ఫోకస్‌తో పనిచేయాలని విశ్వక్ సేన్ ఫిక్స్ అయ్యాడు. ఫంకీతో హిట్ ట్రాక్ ఎక్కి, తదుపరి కాంబినేషన్లతో కూడా అదే సక్సెస్ మేనియాను కొనసాగించాలని చూస్తున్నాడు.

జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్, ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో ప్రిన్స్ చేశాడు. ఇప్పుడు విశ్వక్ సేన్‌తో ఫంకీ ద్వారా మరోసారి తన మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆడియన్స్‌కు అందించడానికి సిద్ధమయ్యాడు. విశ్వక్ మాస్ ఇమేజ్‌కు అనుదీప్ కామెడీ స్క్రీన్‌ప్లే ఎలా వర్క్ అవుట్ అవుతుంది అన్నది వాలెంటైన్స్ డే రోజు సినిమా రిలీజ్ అయినప్పుడు తేలనుంది.


Recent Random Post: